Minister Seethakka : జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుతో ఆ పార్టీ నాయకులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఫలితాలపై మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక రాజకీయాలన్నీ ప్రజలకు స్పష్టంగా తెలుసు అని అన్నారు. దశాబ్దకాలం పాటు ఏ పని చేయని బీఆర్ఎస్ ఎంత తప్పుడు ప్రచారం చేసినా, జూబ్లీహిల్స్ ఓటర్లు విశ్వసించలేదని ఆమె వ్యాఖ్యానించారు.
ప్రజలతో పాటు మంత్రివర్గం, కార్యకర్తలు పటిష్ఠంగా నిలిచినందునే ఈ విజయఫలితం సాధ్యమైందని సీతక్క తెలిపింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పూర్తిగా లోకల్, బీసీ సమాజానికి చెందిన, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కావడం ప్రజల నమ్మకాన్ని గెలుచుకుందన్నారు. బీఆర్ఎస్ సెంటిమెంట్‌పై ఆడినా, మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని ముందుకు తీసుకొచ్చినా, ఓటర్లు ప్రభావితం కాలేదని ఆమె చెప్పుకొచ్చారు.
Bihar Elections Result: ఎన్డీఏ కూటమి డబుల్ సెంచరీ.. తిరుగులేని జయకేతనం
గతంలో పీజేఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తు పెట్టుకున్నారని, కేటీఆర్ చేసిన బుల్డోజర్ ఆరోపణలను కూడా ప్రజలు నమ్మలేదని సీతక్క స్పష్టం చేశారు. నగరం మునిగిపోకుండా హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రజల ప్రయోజనాల కోసమేనని తెలిపారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించిన సీతక్క.. డ్రగ్స్, క్లబ్‌లు, పబ్‌ల సంస్కృతిని కేటీఆర్ ప్రోత్సహించాడని ఆరోపించారు.
వీటికి పూర్తిగా తెరపడుతుందన్న సంకల్పంతోనే సీఎం రేవంత్ పనిచేస్తున్నారని, అందుకే ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని ఆమె పేర్కొన్నారు. సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలే కాంగ్రెస్ విజయం వెనక ఉన్న ప్రధాన కారణాలని సీతక్క పేర్కొన్నారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని మంత్రి వ్యాఖ్యానించారు.
Card Cloning: కార్డ్ క్లోనింగ్ అంటే ఏంటీ.. అది ఎలా జరుగుతుందో తెలుసా…
