టీఆర్ఎస్ పార్టీకి కొత్త నిర్వచనం చెప్పారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రజాకార్ల సమితి అంటూ కామెంట్ చేశారు.. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పిన ఆయన.. దుబ్బాకలో ధమాకా, హుజురాబాద్‌లో హుజూర్ గిర్గయా.. ఇలా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు… బీజేపీ సర్కార్, డబులింజన్ సర్కార్ కోరుకుంటున్నారని తెలిపారు. ఇక, బండి సంజయ్ పాదయాత్రకు విశేష స్పందన వస్తుంది… మోడీ సర్కారు జవాబుదారీ ప్రభుత్వంగా పేర్కొన్నారు.
Read Also: Soaps price: బాత్‌రూమ్‌ని తాకిన ద్రవ్యోల్బణం.. సబ్బులు, షాంపూల ధరలు పెంపు..
భారత్ మారుతోంది, ఎగుమతులు చేసే స్థాయికి వచ్చామని తెలిపారు జేపీ నడ్డా.. ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణకు దూరం చేసింది కేసీఆరేనని మండిపడ్డ ఆయన.. మోస్ట్ కరప్టెడ్ ప్రభుత్వం కేసీఆర్‌ది అని సంచలన ఆరోపణలు చేశారు.. కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎంల మారిందని విమర్శించారు.. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ వైఫల్యం చెందిందన్న ఆయన.. మిషన్ కాకతీయ, భగీరథ్ అవినీతిమయం, బీజేపీ ప్రజాస్వామ్య యుతంగా అధికారంలోకి వస్తుందన్నారు.. కేసీఆర్ సర్కార్ ల్యాండ్ మాఫియా చేస్తుంది.. మరోవైపు, కేంద్ర పథకాలు, కేంద్రం పైసలు కూడా ప్రజలకు అందివ్వడం లేదని ఆరోపించారు.