Site icon NTV Telugu

BJP Meeting: నేడు నగరానికి జేపీ నడ్డా..11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో మీటింగ్..

Jp Nadda

Jp Nadda

BJP Meeting: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో బీజేపీ హైకమాండ్ ఫుల్ నజర్ పెట్టింది. ఇప్పటికే పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేసిన బీజేపీ పార్టీ ఇక జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బీజేపీ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ జిల్లాలో పర్యటించగా.. నేడు బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హైదరాబాద్ కు వస్తున్నారు. అయితే.. హైదరాబాద్ లో జరుగనున్న 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మీటింగ్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మీటింగ్ కొనసాగనుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలే టార్గెట్‌గా కమలం పార్టీ ఈ కీలక మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో వ్యూహాలను సిద్ధం చేయనుంది.

Read also: CM KCR: పదవుల కోసం లీడర్లు పార్టీ మారుతున్నారు.. మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ కామెంట్స్

అటు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు హైకమాండ్ నియమించింది. ఇందులో భాగంగానే తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా ప్రకాష్ జవదేకర్‌కు బీజేపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది.. తనతో పాటు సహ ఇన్‌ఛార్జ్‌గా సునీల్ బన్సల్‌ ను నియమించింది. మధ్యప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌గా భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్‌, రాజస్థాన్ ఇన్‌ఛార్జ్‌గా ప్రహ్లాద్ జోషి, ఛత్తీస్‌గఢ్ ఇన్‌ఛార్జ్‌గా ఓం ప్రకాష్ మాథుర్‌, మాండవియాలను నియమించింది. ఇక తెలంగాణలో బీజేపీ అగ్రనేతల వరుస పర్యటనలతో పాటు ఇప్పుడు 11 రాష్ట్రాలకు చెందిన కమలం పార్టీ అధ్యక్షుల సమావేశాలతో తెలంగాణ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కుతున్నాయి.
Fire Accident: సికింద్రాబాద్‌ పాళికా బజార్‌లో భారీ అగ్నిప్రమాదం.. బట్టల షాప్‌ లో చెలరేగిన మంటలు

Exit mobile version