Site icon NTV Telugu

Harish Rao: జ‌ర్న‌లిస్టుల‌కు అండ‌గా వుంటాం

Harish Rao

Harish Rao

ఆప‌ద‌లోనైనా ప్ర‌జ‌ల‌కు మేమున్నామంటూ చేదోడుగా నిలిచి, త‌మ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హరీశ్‌ రావు భరోసా ఇచ్చారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్‌ అలీ అధ్యక్షతన బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియా, సాహిత్యం అవార్డుల ప్రధానోత్సవ సమావేశం జరిగింది. ఆర్‌ఎస్‌ఎన్‌ సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్‌ రావు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారని కొనియాడారు.

జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం రూ. 42 కోట్లు కేటాయించిందని.. జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం కోసం సీఎం యోచిస్తున్నారని హరీశ్‌రావు వివరించారు. అనంతరం కామారెడ్డి విలేకరి ఎస్‌.వేణు గోపాలచారికి ద్వితీయ అవార్డుతోపాటు మరి కొందరు జర్నలిస్టులు, కవులను ఆర్‌ఎస్‌ఎన్‌ అవార్డులతో సత్కరించారు.

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టు సంఘం ప్రధాన కార్యదర్శి కె.విరాహత్‌ అలీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ ఎన్‌ సేవా ఫౌండేషన్‌ ట్రస్టీ ఆర్‌.సత్యనారాయణ, టీఎస్‌పీఎస్సీ సభ్యుడు కారం రవీందర్‌ రెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు, ఆర్‌ఎస్‌ఎన్‌ అవార్డు జ్యూరీ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ కె.రామచంద్ర మూర్తి, ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ నందిని సిధారెడ్డి, తెలంగాణ బేవరేజస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ జి.దేవీప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Errabelli Dayakar Rao: కాటమయ్యకు బోనమెత్తిన మంత్రి ఎర్రబెల్లి

Exit mobile version