NTV Telugu Site icon

Gadwala Politics: పార్టీలోకి బండ్ల కృష్ణను చేర్చుకోవద్దు.. సీఎంను కలిసిన సరిత..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

Gadwala Politics: జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో హాట్ హాట్ గా గద్వాల రాజకీయం మారుతుంది. రోజు రోజుకు పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ పెరుగుతుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తారన్న వార్త కాంగ్రెస్‌ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. రేపో మాపో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటారనే వార్తతో సరిత వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి హస్తం గూటికి రావడాన్ని సరిత వర్గం వ్యతిరేఖిస్తుంది. ఎమ్మెల్యే ను పార్టీలోకి చేర్చుకోవద్దు అంటూ కార్యకర్తల నిరసనలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవద్దంటూ.. గద్వాల కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ భారీగా గాందీభవన్ కు తరలివెళ్లారు. అక్కడ సీఎం రేవంత్‌ రెడ్డిని గద్వాల్‌ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ సరిత కలిసారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని చేర్చుకోవద్దంటూ తెలిపినట్లు సమాచారం. మరి దీనిపై చర్చించిన సీఎం రేవంత రెడ్డి ఏ నిర్ణయం తీసుకోనున్నారనేదానిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠత నెలకుంది. నిన్న (గురువారం) ఏకంగా ఓ కార్యకర్త సెల్‌ టవర్‌ ఎక్కి ఆందోళనకు దిగిన తీరు గద్వాలలో సంచలనంగా మారింది. దీంతో అక్కడ ఉద్రిక్త ప్రరిస్థితి నెలకుంది.

Read also: Chittoor: చిత్తూరులో వైసీపీకి భారీ షాక్

బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి సరితతో విభేదాలు

స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల జెడ్పీ చైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య మధ్య గత కొంతకాలంగా రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రెండూ వేర్వేరు పార్టీలే అయినప్పటికీ గద్వాల నియోజకవర్గంపై ఇరువురి మధ్య రాజకీయ పోరు నడుస్తోంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ సరిత మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. అధికారులు ఎవరికి వారుగా వ్యవహరించి ఇబ్బందులకు గురిచేస్తున్నారనే చర్చ సాగుతోంది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో ప్రొటోకాల్ వివాదాలు రాజుకుంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో జెడ్పీ చైర్‌పర్సన్ సరిత సొంత క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాకను సరితా తిరుపతయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Rahul Gandhi : హత్రాస్ ప్రమాదానికి ఎవరు బాధ్యులు.. రాహుల్ భోలే బాబా గురించి ఏం చెప్పారంటే ?