B.Krishna Mohan: బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే..?
- బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్..
- కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
B.Krishna Mohan: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. కారు గుర్తుపై గెలిచిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే పలుమార్లు హైదరాబాద్ మంత్రి జూపల్లిని కలిశారు. మరో రెండు, మూడు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ అధిష్ఠానం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే పార్టీ మారడం దాదాపు ఖాయమని, వారం రోజుల్లోగా ఎప్పుడైనా బీఆర్ ఎస్ వీడనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఇదే విషయమై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని సంప్రదించగా… పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న తర్వాత చేరికపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. పార్టీ మారాలని అనుచరుల నుంచి ఒత్తిడి వస్తోందన్నారు. మండలాల వారీగా అభిప్రాయ సేకరణ చేస్తున్నా అని తెలిపారు. నియోజక వర్గ ప్రయోజనాల కోసమే పార్టీ మార్పు ఆలోచన అన్నారు. అందరి నిర్ణయం మేరకే తుది నిర్ణయం అన్నారు.
Read also: CM Chandrababu: ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ!
Also Read
- Road Accident: అదుపుతప్పి బోల్తాపడ్డ బస్సు.. 20 మందికి గాయాలు!
- OTR: తెలంగాణలో పాగా వేయడానికి ఇదో అవకాశం.. జనసేనాని ఎంట్రీతో లాభం ఎవరికి? నష్టం ఎవరికి?
- Tragic Accident: విషాదం.. ట్రాక్టర్ రివర్స్ తీసుకుంటుంగా ప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారి...
- Son Kills Father: మనిషి కాదు.. నరరూప రాక్షసుడు! కన్నతండ్రినే కిరాతకంగా..!
స్థానిక ఎమ్మెల్యే, గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరితకు మధ్య విబేధాలు తారా స్థాయికి చేరడంతో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే మొదట తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కృష్ణమోహన్ రెడ్డి 2009లో గద్వాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో 2014లో పార్టీలో చేరి మళ్లీ గద్వాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018, 2023 సార్వత్రిక ఎన్నికల్లో గద్వాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా సరిత పదవీకాలం నేటితో ముగియనుంది.
Boyfriend Harassment: నా చావుకు అతడే కారణం.. యువతి సూసైడ్ నోట్ వైరల్..
తాజావార్తలు
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!