CM KCR: నేడే గద్వాల కలెక్టరేట్ ఆఫీస్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయంతో పాటు ఎస్పీ కార్యాలయం, భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఆఫీస్ ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. అనంతరం గద్వాలలోని అయిజ రోడ్డులో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. దీంతో సీఎం పర్యటన నేపథ్యంలో గద్వాల్ పట్టణం మొత్తం గులాబీమయంగా మారింది. సీఎం కేసీఆర్ సాయంత్రం 4:30 కి హెలికాప్టర్ ద్వారా గద్వాల్ చేరుకోనున్నారు.
Read Also : Balayya : ఆ సినిమా విషయంలో తన నిర్ణయం మార్చుకున్న బాలయ్య..?
Also Read
- Road Accident: అదుపుతప్పి బోల్తాపడ్డ బస్సు.. 20 మందికి గాయాలు!
- OTR: తెలంగాణలో పాగా వేయడానికి ఇదో అవకాశం.. జనసేనాని ఎంట్రీతో లాభం ఎవరికి? నష్టం ఎవరికి?
- Tragic Accident: విషాదం.. ట్రాక్టర్ రివర్స్ తీసుకుంటుంగా ప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారి...
- Son Kills Father: మనిషి కాదు.. నరరూప రాక్షసుడు! కన్నతండ్రినే కిరాతకంగా..!
పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ బీఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లతో పూర్తిగా నిండిపోయాయి. సమీకృత కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్ క్రాంతి, ఎస్పీ సృజనతో కలిసి పరిశీలించారు.
Read Also : Telangana: తెలంగాణలో నేటి నుంచి స్కూల్స్ పున: ప్రారంభం
గద్వాల్ జిల్లా కేంద్రంలోని అయిజ రోడ్డు తెలంగాణ చౌరస్తా సమీపంలో ని మైదానంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాకు గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలు, వాటి అమలు తీరు, పనుల పురోగతిని ముఖ్యమంత్రి ప్రజలకు వివరించడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై సభలో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. దీంతో గద్వాల పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభ ముగింపు తర్వాత రాత్రి 8 గంటలకు బస్సులో హైదరాబాద్ కు సీఎం కేసీఆర్ తిరుగుప్రయాణం అవుతారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..