NTV Telugu Site icon

Jurala Project: జూరాల ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తివేత.. హెచ్చరికలు జారీ..

Jurala Projuct

Jurala Projuct

Jurala Project: గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 42 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2.06 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ నుంచి 1.97 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో స్పిల్‌వే ద్వారా 1.69 లక్షల క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 24,201 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్‌కు 1500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్‌కు 1300 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుతం 316.71 మీటర్లకు నీరు చేరింది.

Read also: Operation Dhoolpet: ఆపరేషన్ దూల్పేట్.. గంజాయి నిర్మూలన లక్ష్యంగా దాడులు..

అదేవిధంగా ప్రాజెక్టులో 9.65 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.23 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మహారాష్ట్రలోని ఆల్మట్టి నుంచి 2.25 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వస్తోంది. ఉదయం 10.30 గంటలకు 2.50 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా కర్ణాటకలోని నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి 2.24 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 26.623 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 33.313 టీఎంసీలు.
BJP MLAs Slept Inside Assembly: రాత్రంతా అసెంబ్లీలోనే నిద్రపోయిన ఎమ్మెల్యేలు