Operation Dhoolpet: ఆగస్టు 31 లోపు దూల్పేటలో గంజాయి అమ్మకాలు రవాణా వినియోగం లేకుండా చేయడమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ దూల్పేట్ నిర్వహించారు. ఇందులో భాగంగా గంజాయిని పూర్తిగా నిర్మూలించ నిర్మూలనకు ఎక్సైజ్ పోలీస్ టీములతోపాటు పోలీసులు కూడా కలిసి జాయింట్ గా తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ కమిషనర్ ఈ శ్రీధర్ , ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించారు. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి వరకు దూల్పేటలో అనుమానిత ప్రాంతాలపై తనిఖీలు నిర్వహించారు. గంజాయి అమ్మకాలు చేపట్టిన పాత నేరస్తులతోపాటు కొత్తగా గంజాయి అమ్మకాల్లో దిగిన వారి గృహాల్లో తనిఖీలు నిర్వహించారు.
Read also: BJP MLAs Slept Inside Assembly: రాత్రంతా అసెంబ్లీలోనే నిద్రపోయిన ఎమ్మెల్యేలు
దూల్ పేటలో ఎక్సైజ్ ఎస్టిఎఫ్ టీం జరిపిన దాడుల్లో 2.660 గంజాయిని పట్టుకున్నారు.. దూల్పేట్ లోని మల్చిపుర,లోయర్ దూల్పేట్ ప్రాంతాల్లో ఎక్సైజ్ సూపర్డెంట్ అంజిరెడ్డి దూల్పేట్ సీ ఐలతో కలిసి దాడులు నిర్వహించారు. దాడుల్లో నిందితుల వద్ద 2.660 గంజాయి తో పాటు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి తో పాటు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. మరో ఐదుగురిని అనుమానితులుగా చేర్చారు. గంజాయి అమ్ముతూ అరెస్ట్ అయిన వారిలో నీలేష్ సింగ్, గుండు సింగ్ నీతూ భాయ్ లు ఉన్నారు. .ఈ దాడిలో ఎక్సైజ్ సూపర్డెంట్, ఎస్ టి ఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి తో పాటు దూల్పేట్ సిఐలు మధుబాబు, గోపాల్ తో పాటు సిబ్బంది భాస్కర్ రెడ్డి,సైదులు ప్రకాష్ శ్రీధర్ రాకేష్ లు ఉన్నారు. గంజాయిని పట్టుకున్నటువంటి టీం ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హసన్ రెడ్డి అభినందించారు. మరోవైపు సికింద్రాబాద్ – బోయిన్ పల్లిలో గంజాయిని విక్రయిస్తున్న ఓ వ్యక్తి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీతరామపురంలో నిందితుడి ఇంట్లో తనికీ చేసి 20 కేజీల గంజాయి స్వాథీనం చేసుకున్నారు. గంజాయి ఎక్కడ నుంచి తీసుకవచ్చరానే విషయలపై దర్యాప్తు జరుపుతున్నారు.
Hyderabad Crime: తల్లి బలవన్మరణం.. షాక్ గురైన కొడుకు కూడా..