Bharat Jodo Yatra: నేడే భారత్ జోడో గర్జన.. లక్ష మందితో సభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్‌లో నేడు బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీంతో.. భారత్ జోడో గర్జన పేరుతో లక్ష మందితో ఈసభను తలపెట్టారు. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సభ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఇందుకుతగిన సన్నాహాలు చేస్తున్నారు..ఈ సభతో తెలంగాణలో రాహుల్ గాంధీ యాత్ర పూరై మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. ఇక, 119 నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సభకు తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా, జోడో యాత్ర ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడ్‌పగల్ మండలానికి చేరుకుంది. రాహుల్ ఇక్కడే బస చేశారు. ఇవాళ జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం ఫతాలపూర్ గేటు నుంచి యాత్ర ప్రారంభించనున్నారు. ఇక మేనూరు వరకు 20 కి.మీ. మేర యాత్ర చేస్తారు. మరోవైపు ఈ నెల 2న సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర ఆదివారంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ముగిసింది. ఈయాత్ర 5 రోజుల పాటు 130 కిలోమీటర్ల మేర నడిచారు. ఇక.. ఆదివారం అల్లాదుర్గం మండలం రాంపూర్ నుంచి పాదయాత్రను ప్రారంభించి పెద్దశంకరంపేట మండలం కమలాపూర్ వరకు నడిచారు. సాయంత్రం 4 గంటలకు సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు వాహనంలో రాహుల్ బయల్దేరారు. కాగా..అక్కడినుంచి బాచేపల్లి, మహదేవునిపల్లి మీదుగా మాసాన్‌పల్లి వరకు పాదయాత్ర సాగింది. తదనంతరం పెద్దకొడ్‌పగల్ గ్రామానికి వెళ్లారు.
Also Read
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
- Local Governance : గ్రామ పంచాయతీలకు బంపర్ పవర్.. సొంత ఆదాయంపై పూర్తి హక్కు.!
- HYDRAA : కోర్టు ఆదేశాలే పట్టవా?.. హైడ్రాపై హైకోర్టు ఫైర్.!
తాజావార్తలు
-
Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
-
Rohit Sharma Retirement: లార్డ్స్‌లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడా..!
-
India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
-
RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
-
Astrology: జాతకంలో శని శుభప్రదంగా ఉన్నప్పుడు.. జీవితంలో అద్భుతమైన మార్పులు.. ఇవే ఆ సంకేతాలు!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!