JNTU Sultanpur : జేఎన్‌టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్

  • జేఎన్‌టీయూ క్యాంపస్‌లో ర్యాగింగ్ కలకలం
  • సెకండ్ ఇయర్ విద్యార్థిపై దాడి
  • NH-161పై విద్యార్థుల బైఠాయింపు
  • ఇద్దరు సీనియర్లను సస్పెండ్ చేసిన యాజమాన్యం
Jntuh

Jntuh

సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్‌లోని జేఎన్‌టీయూ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. ఈఈఈ సెకండ్ ఇయర్ చదువుతున్న రుత్విక్‌పై నలుగురు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. నిన్న క్యాంపస్‌లో రుత్విక్‌పై దాడి చేసి గొంతు పిసికినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధిత విద్యార్థి కాలేజీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని తోటి విద్యార్థులు ఆరోపించారు. దీంతో సెకండ్ ఇయర్ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

 

రుత్విక్ తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు జాతీయ రహదారి 161పై బైఠాయించి నిరసన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనతో కాలేజీ యాజమాన్యం స్పందించింది. ఘటనపై విచారణ చేపట్టి, ర్యాగింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనతో క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ర్యాగింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.