MLC Jeevan Reddy: బతుకమ్మ ఆడగానే హిందూ మతాన్ని గౌరవించినట్లా? అని ఎమ్మెల్సీ కవితపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా.. ఎమ్మెల్యే జిల్లా డీసీసీ అధ్యక్షులు అడ్డూరి లక్ష్మణ్ తో కలిసి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కవిత ఏంది అసలు నాకు అర్ధం కాదు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలని అన్నారు. యూనియన్ లొ ఉండి ఇవాళ ఎన్నికల్లో పోటీ చేసే స్థాయి కూడా కోల్పోయిందన్నారు. పథకాల అమలులో ఎలాంటి అనుమానం అక్కరలేదని, తప్పకుండ అన్ని అమలు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇవ్వమంటే ఇవ్వడం లేదు.. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు అమలు చేసి తీరుతామన్నారు. దొరసాని (ఎమ్మెల్సీ కవిత) 5 యేండ్లు పదవిలో ఉండి ఎం చేసిందన్నారు. ఉన్న చక్కర ఫ్యాక్టరీ మూసేయించిందని, కానీ దానిని మేము తెరిపించబోతున్నామని క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్ సభ్యురాలుగా ముఖ్యమంత్రి తనయ గా ఆమె ఏం చేయలేదని మండపడ్డారు.
Read also: DCP Sharath Chandra: నయాసాల్ డ్రగ్స్ అమ్మకాలు.. కొనేవారిపై నిఘా..
కవిత ఏ మతాన్ని గౌరవిస్తదో చెప్పమనండన్నారు. బతుకమ్మ ఆడగానే హిందూ మతాన్ని గౌరవించినట్లా? అని ప్రశ్నించారు. మేం హిందూమతం తో పాటు అన్ని మతాలను గౌరవిస్తామన్నారు. కవిత ఎన్ని గుళ్లను కాపాడగలిగిందన్నారు. జగిత్యాల రామాలయం గుడి ఆక్రమణకు గురి కాకుండా కాపాడినామన్నారు. ధరూర్ క్యాంపులో ఎమ్మెల్యే చేతులు ఎత్తేస్తే నేను హనుమాన్ టెంఫుల్ కాపాడానని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల వస్తే మీకు ముస్లింలు కావాలి.. మన మతాన్ని ఎంత ప్రేమిస్తామో ఇతర మతాలను అంతే గౌరవించాలన్నారు. దొరసాని పుణ్యం వల్ల పదేండ్లల్ల బొగ్గు గని కార్మిక సంఘం రద్దు అయిపోయిందన్నారు. సింగరేణి ఎన్నికల్లో మా మిత్రపక్షమే గెలిచిందని తెలిపారు. ఇది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మాకు కలిసోచ్చే అంశమే అన్నారు. జిల్లా కేంద్రంలో ఇందిరాభవన్ లో ఘనంగా 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు.
MLA Anna Rambabu: ఆ మాటకే కట్టుబడి ఉన్నా.. ఈ సారి పోటీ నుంచి తప్పుకుంటున్నా..