Site icon NTV Telugu

Jayashankar Bhupalpally: స్వగ్రామానికి మావోయిస్టు అన్నె సంతోష్ మృతదేహం.. గ్రామంలో విషాదఛాయలు

Maoist

Maoist

చత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు అన్నె సంతోష్ @ సాగర్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా.. బీజాపూర్ లో సంతోష్ మృతదేహాన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో.. స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం (మం) స్వగ్రామం దస్తగిరిపల్లికి చేరింది. అయితే.. స్వగ్రామానికి తీసుకువచ్చిన వృద్ధ తల్లిదండ్రులు అంతక్రియలు నిర్వహిస్తున్నారు. అంత్యక్రియల్లో గ్రామస్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఎర్రజెండాలతో స్వాగతం పలికుతూ అంతిమయాత్ర నిర్వహించారు. కన్నీటి పర్యంతంతో గ్రామస్తులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మరోవైపు.. సంతోష్ మృతితో కాటారం సబ్ డివిజన్ వ్యాప్తంగా నక్సలైట్ల అజ్ఞాతపర్వం ముగిసినట్లైంది.

Read Also: Prashant Kishor: రాహుల్ గాంధీ పక్కకు తప్పుకుంటే మంచిది.. కాంగ్రెస్‌కి ప్రశాంత్ కిషోర్ సలహా..

శనివారం.. ములుగు జిల్లా వెంకటాపురం సర్కిల్ పరిధిలోని కర్రిగుట్టలు – ఛత్తీస్ గఢ్ వైపు ఉన్న కాంకేర్ బోర్డర్ కర్రెగుట్టలో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలిలో 3 తుపాకులు, పేలుడు పదార్ధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజుల క్రితం బీజాపూర్లో జరిగిన ఎన్ కౌంటర్లో 13 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే.

Read Also: MI vs DC: ఢిల్లీ ముందు భారీ లక్ష్యం.. చితక్కొట్టిన ముంబై బ్యాటర్లు

Exit mobile version