Site icon NTV Telugu

Kadiyam Srihari: కేంద్ర ప్రభుత్వం ఒక ఫెడరల్ సెటప్.. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే..!

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రిపబ్లిక్ డే సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్ వెళ్లి రాష్ట్రానికి లక్ష 78 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తే.. సంతోషించవలసిన కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేది ఒక ఫెడరల్ సెటప్.. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కేంద్రం అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.

Read Also: UPSC New Rules: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‭లో అమలులోకి రానున్న కొత్త నిబంధనలు

ఇందిరమ్మ ఇండ్లకు ఇందిరమ్మ అనే పేరు పెడితే ఇండ్లు ఇవ్వమని బండి సంజయ్ అనడం హాస్యాస్పదం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టేది టాక్సీలు కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రం కట్టే టాక్సీలో వాటాను చెల్లించండి.. మీది ఒక్క పైసా వద్దని అన్నారు. తెలంగాణపై బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు ప్రేమ ఉంటే అభివృద్ధి కోసం నిధులు తీసుకువచ్చి సహకరించాలి.. చౌకబారు విమర్శలు మానుకొని భాగస్వాములు కావాలి.. సంక్షేమ పథకాలలో ప్రతిపక్షాలు భాగస్వాములు కావాలని కడియం శ్రీహరి తెలిపారు.

Read Also: Road Accident: వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Exit mobile version