Site icon NTV Telugu

Kadiyam Srihari: రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన కడియం శ్రీహరి..

Kadiyam Srihari

Kadiyam Srihari

Kadiyam Srihari: నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సన్నాక సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు.. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం.. మరోవైపు, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌.. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేల వివరణ తీసుకుంటున్న సమయంలో.. తన రాజీనామాపై జరుగుతోన్న ప్రచారంపై స్పందించిన కడియం శ్రీహరి.. నేను రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు.. అయితే, స్పీకర్‌ నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ఉంటుందని.. ఏ నిర్ణయమైనా నియోజకవర్గ ప్రజల సహకారం నాకు ఉంటుందన్నారు.. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతారు.. కానీ, తొందరగా ప్రజలు వాళ్లను మర్చిపోతారు.. కానీ, నన్ను మర్చిపోయిన వాళ్లు లేరని.. కడియం అంటేనే ఓ బ్రాండ్ అని పేర్కొన్నారు..

Read Also: Andhra King Taluka : ఇలాంటి సినిమా ఇప్పటి దాకా రాలేదు : డైరెక్టర్ మహేశ్ బాబు

ఇక, జూబ్లీహిల్స్ ఎన్నికలపై బీఆర్ఎస్, బీజేపీ విష ప్రచారం చేశాయి.. కానీ, బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు… స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒక్క సర్పంచ్ కూడా గెలుచుకోదు అని జోస్యం చెప్పారు కడియం శ్రీహరి.. బీఆర్ఎస్ తోనే కాంగ్రెస్ కు పోటీ అన్నారు.. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవంగా బలపరిస్తే గ్రామ అభివృద్ధి కి 10 లక్షల రూపాయలు ఇస్తాం.. సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే 25 లక్షల రూపాయలు గ్రామ అభివృద్ధికి ఇస్తాను అని ప్రకటించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. కాగా, తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యే వ్యవహారం హాట్ టాపిక్ అయిన విషయం విదితమే..

Exit mobile version