NTV Telugu Site icon

Road Accident: పేలిన టైరు.. మృత్యుఒడికి ముగ్గురు

Accident

Accident

తెలంగాణ రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు భయపెడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోటు రోడ్డు ప్రమాద వార్తలు విషాదం నింపుతున్నాయి. రహదారులు రక్తమోడేలా చేస్తున్నాయి. తాజాగా వాహ‌నం టైరు పేలి ముగ్గురు ప్ర‌యాణికులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందిన ఘ‌ట‌న జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి వద్ద చోటుచేసుకుంది. 10 మంది ప్ర‌యాణికుల‌తో వున్న ట‌వేరా వాహనం హ‌నుమకొండ నుండి హైద‌రాబాద్ కు బ‌య‌లు దేరింది. ఒక్క‌సారిగా స‌బ్దం రావ‌డంతో.. స్థానికులు ప‌రుగులు పెట్టారు. ట‌వేరా వాహ‌నం టైరు పేలి ముగ్గ‌రు మృతి చెందారు. మ‌రో ముగ్గురికి గాయాలు. స్థానిక స‌మాచారంతో పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను జనగామ జిల్లా ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కేసున‌మోదు చేసుకుని విచార‌ణ చేప‌ట్టారు.

ఇక ఇలాంటి ఘ‌ట‌నే ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటూరునాగరం వద్ద 163 జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. మృతులను ములుగు మండలంలోని జాకారానికి చెందిన వల్లాల కృష్ణయ్య (45), వరంగల్‌కు చెందిన శివ (17)గా గుర్తించారు. తునికాకు సేకరణ కోసం ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Jubilee Hills Case: గ్యాంగ్ రేప్ కేసులో.. మరో ఇద్దరు..!