Site icon NTV Telugu

Janasena : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన..

Janasena Pawan

Janasena Pawan

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. శనివారం ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ, రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

PhonePe కొత్త ఫీచర్.. ఒక క్లిక్‌తో చెల్లింపు.!

ఎన్నికలకు నెల రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ, తెలంగాణలోని సాధ్యమైనన్ని మున్సిపల్ స్థానాల్లో జనసేన అభ్యర్థులను బరిలోకి దించుతామని పార్టీ స్పష్టం చేసింది. ఇందుకోసం పార్టీ ఇప్పటికే తన కార్యచరణను ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న జనసైనికులు, వీరమహిళలు ఈ ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొని పార్టీ బలోపేతానికి తోడ్పడాలని పార్టీ పిలుపునిచ్చింది.

ఈ ఎన్నికల ద్వారా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, ఆయన భావజాలాన్ని తెలంగాణలోని ప్రతి ఇంటికీ చేరవేయడమే ప్రధాన ఉద్దేశ్యమని జనసేన వెల్లడించింది. పవన్ కళ్యాణ్ కి తెలంగాణ ప్రాంతం పట్ల ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ప్రజలకు వివరించి, రాష్ట్రంలో ఒక సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే ఈ పోటీ వెనుక ఉన్న అసలు లక్ష్యమని పార్టీ తన ప్రకటనలో వివరించింది. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఎంట్రీ ఇవ్వడంతో తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారనున్నాయి.

Andhra Pradesh Census: ఏపీలో జన గణన కసరత్తు ప్రారంభం.. అడ్డుకుంటే జైలుకే..!

Exit mobile version