Site icon NTV Telugu

Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొననున్న పవన్..?

Pawan

Pawan

Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి జనసేన పార్టీ అధికారికంగా మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి లతో హైదరాబాద్‌లోని సాగర్ సొసైటీలో భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహా ఇరుపార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ భేటీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని విజయవంతం చేయడానికి జనసేన పార్టీ పూర్తిస్థాయి సహకారం అందించనున్నట్లు శంకర్ గౌడ్ తెలిపారు. రేపు రెండు పార్టీల నాయకులు సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించి, తమ సంయుక్త ప్రచార కార్యాచరణ వివరాలను వెల్లడించనున్నారు. ఈ నిర్ణయం జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

UPI Malaysia Launch: సాహో భారత్.. మలేషియాలో యూపీఐ అధికారిక సేవలు ప్రారంభం

Exit mobile version