రైతుల సమస్యలపై పీసీసీ తలపెట్టిన ఆందోళనలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కేసీఆర్‌పై విమర్శల దాడి చేశారు. ప్రజలు ఎప్పుడు అభిమానిస్తే అప్పుడే అధికారంలోకి వస్తామని జానా రెడ్డి అన్నారు. పీసీసీ చేపట్టిన ఆందోళనకు అభినందలు చెబుతున్నాని ఆయన అన్నారు. రైతుల సమస్యలు పరిష్కారించాలని కేంద్ర, రాష్ర్టా ప్రభుత్వాలను హెచ్చరించారు. పదవుల కోసమే… ప్రభుత్వం వస్తోందనో… స్వాతంత్ర్య ఉద్యమం చేయడం లేదని.. రైతుల కోసం చేస్తున్నామని జానా అన్నారు. కాంగ్రెస్ ఏం చేసింది అని అడిగే వారికి చెబుతున్నా అంటూ ఘాటు వ్యాఖ్యలతో సమాధానం చెప్పారు జానారెడ్డి. అటవీ హక్కుల చట్టాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చింది. ఆహారభద్రత, ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టం తెచ్చింది, అవినీతికి వ్యతిరేకంగా చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు జానారెడ్డి.
టీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి హాట్ కామెంట్లు చేశారు జానారెడ్డి.. మీ అధికారం గుంజుకోవాలని కాదు, మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతుల సమస్యలను పక్కన పెడుతున్నారన్నారు. కేంద్రం..రాష్ట్రం సమస్యలు ఒకరి మీద ఒకరూ నెట్టుకుంటున్నారు. మీ ఇద్దరికి బుద్ధి చెప్పి ప్రజలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకోస్తారన్నారు. . కాంగ్రెస్ అధికారంలోకి రావడం అవసరం అని ప్రజలు భావించేలా పని చేయాలని సభ స్థలి నుంచి కార్యకర్తలకు ఆయన సూచించారు. అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి… సమస్యల కోసం ఏకం అవ్వడన్ని కాంగ్రెస్ కార్యకర్తలు స్వాగతిస్తారని జానా రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా రైతుల సమస్యలు పరిష్కరించకపోతే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తోందని జానా రెడ్డి వెల్లడించారు.
