NTV Telugu Site icon

Peddapalli: ట్రాన్స్ జెండర్ గా మారిన వారికి ‘జల్సా’ ఈవెంట్..

Peddapalli Distric

Peddapalli Distric

Peddapalli: ట్రాన్స్ అంటేనే అంటరాని వారిగా చూస్తారు చాలామంది. వారిని చూసిన వారు అసహ్యించు కుంటుంటారు. బస్టాండ్ లలో రైళ్లలో, బస్సులో చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతూ వారి జీవనం సాగిస్తుంటారు. వీరిక్కూడా మనసుంటుందని, కుటుంబాలకు దూరమై బాధతో బతుకుతుంటారని మాత్రం ఎవరూ ఊహించలేరు. అయితే వీల్లందరూ ఒక చోట కలిస్తే పండుగ వాతావరణమనే చెప్పాలి. వీరు కూడా ఈవెంట్ లు చేసుకుంటారని మీకు తెలుసా. దానిపేరే జల్సా ఈవెంట్. ఇదేదో పవన్ కళ్యాణ్ మువీ అనుకుంటే పప్పులో కాలువేసినట్లే. జెండర్స్ మారిన వ్యక్తులను ట్రాన్స్ జెండర్స్ ఆధ్వర్యంలో జల్సా ఈవెంట్ చేస్తారు. దీనినే జల్సా అంటారు. ఇది ఎక్కడో కాదండోయ్ తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఈ పండుగ వాతావరణం జరుపుకున్నారు.

Read also: బిర్యానీ అసలు పేరేంటో ఎప్పుడైనా ఆలోచించారా?

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాన్స్ జెండర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జల్సా కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి ట్రాన్స్ జెండర్స్ కమిటీ హాజరై జల్సా వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. అందరూ కలిసి ఆట పాటలతో డ్యాన్స్ చేస్తూ పండగ వాతావరణాన్ని సృష్టించుకుని, కలిసి భోజనాలు తింటారు. ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ గా సర్జరీ చేయించుకుని 41 రోజులు ఇంట్లో విశ్రాంతి తీసున్న తర్వాత తమ కుల దైవమైన అమ్మవారికి పూజ నిర్వహించి ఆ తర్వాత ట్రాన్స్ జెండర్ గా మారిన వారికి ఒక ఈవెంట్ చేయడం జరుగుతుందనీ దీన్నే ‘జల్సా’ పేరిట కార్యక్రమం నిర్వహహిస్తామని ఈ ఈవెంట్ కు రాష్ట్ర స్థాయి ట్రాన్స్ జెండర్స్ హాజరై ట్రాన్స్ జెండర్ గా మారిన వాళ్ళను ఆశీర్వదిస్తారని అన్నారు. ఆడవాళ్లకు సారీ ఫంక్షన్ ఎలాగో మాకు ఈ జల్సా పేరిట నిర్వహించే ఈవెంట్ చాలా ప్రాముఖ్యతను ఇస్తామని అన్నారు.

Read also: Bandi Sanjay: కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ పౌరసరఫరాల శాఖలోనే..

ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ స్వప్నిల్ షిండే ట్రాన్స్‌జెండర్‌గా మారిన విషయం తెలిసిందే. దీపికా పదుకొనే, అనుష్క శర్మ, కరీనా కపూర్ వంటి ప్రముఖులకు ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేశాడు. తన పేరును ‘సైషా’గా మార్చుకుంటున్నట్లు ప్రకటించాడు. “నేను స్వలింగ సంపర్కురాలిని కాదు… కానీ ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్‌ని” అని ఆమె చెప్పుకొచ్చారు. కొద్దినెలల క్రితం తాను మగవాళ్లంటే ఇంట్రెస్ట్ చూపించేవాడినని, కాలేజీ రోజుల్లో అందరూ తనను అదోమాదిరిగా చూసేసరికి చాలా బాధపడ్డానని సైషా వెల్లడించింది. 20 ఏళ్ల వయసులో నిఫ్ట్‌లో ఉన్నప్పుడు ఆరేళ్ల క్రితం జరిగిన సంఘటనలేమిటో తెలుసుకునే సాహసం చేశానని, రియాలిటీలో జీవించడం ఉక్కిరిబిక్కిరి అయ్యేలా అనిపిస్తోందని వివరించిన విషయం తెలిసిందే..
Telangana: తెలంగాణలో మళ్లీ మండుతున్న ఎండలు..

Show comments