NTV Telugu Site icon

Jagtial District: ఉద్యోగం ఇప్పించండి..! లేదా ముగ్గురు పిల్లలతో సహా కారుణ్య ఆత్మహత్యకైనా అనుమతించండి..

Jagtial District

Jagtial District

Jagtial District: తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని లేనిపక్షంలో కారుణ్య ఆత్మహత్యకు అయినా అనుమతించాలని కోరుతూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన నక్క సునీత అనే మహిళ ప్రజావాణిని ఆశ్రయించింది. ముగ్గురు మానసిక దివ్యాంగులైన పిల్లలతో ఉపాధి లేక పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ముగ్గురు పిల్లలు మానసిక దివ్యాంగులు కావడంతో తన భర్త ఉపాధి కొరకు గల్ఫ్ దేశానికి వలస వెళ్లినట్లు సునీత తెలిపింది. పీజీ స్పెషల్ బీఈడీ చదివిన తనకు కాంట్రాక్టు పద్ధతిలో ఏదైనా ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని అధికారుల ద్వారా ప్రభుత్వాన్ని కోరింది. తన పిల్లలు లాగా చాలా మంది పేరెంట్స్ దివ్యాంగులైన పిల్లలను కలిగి ఉన్నారని అలాంటి వారందరూ మానసికక్షోభకు గురవుతున్నట్లు వాపోయింది.

Read Also: Toxic : జనవరి 8న యష్ టాక్సిక్ అప్ డేట్.. ఫోటోతో కన్ఫాం చేసిన మేకర్స్

స్పెషల్ బీఈడీ చేసిన తనకు ప్రత్యేక ఉపాధ్యాయురాలిగా కాంట్రాక్టు పద్ధతిలో అవకాశం కల్పిస్తే అలాంటి పిల్లలందరికీ చదువు చెప్తానని తద్వారా తనకు ఉపాధి దొరుకుతుందని కోరింది. తనకు ఉద్యోగం ఇవ్వడానికి 370 జీవో అడ్డుగా ఉందని అధికారులు చెబుతున్నారని కనీసం తన భర్త కైనా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని వేడుకుంది. అయితే ఇటీవల డీఎస్సీ రాసినప్పటికి మెరిట్ రాలేదని చదువుపై మక్కువ ఉన్నప్పటికీ ముగ్గురు దివ్యాంగులైన పిల్లల బాగోగులు చూస్తూ చదవడం వల్ల 40 శాతం మార్కులు సాధించినట్లు తెలిపింది. ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కానిపక్షంలో ముగ్గురు పిల్లలతో సహా తమకు ఆత్మహత్యనే శరణ్యమని అందుకే కారుణ్య ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రజావాణిలో వినతి పత్రం అందజేసినట్లు తెలిపింది.

Show comments