MLC Kavitha: జగిత్యాల జిల్లా ఎమ్మెల్యే సంజయ్ పై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పైసల కోసం సంజయ్ పార్టీ మారాడు పైసలా కోసం పార్టీ మారినవాడు నాయకులు కారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. దరూర్ వద్దకు చేరుకున్న కవితను బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. దరూర్ బైపాస్ వద్ద అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో పెట్టిన విగ్రహం తెలంగాణ తల్లి కాదని అన్నారు.
Read also: Bhadradri: భద్రాద్రి జిల్లా సరిహద్దులోకి పెద్దపులి.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు
తెలంగాణ ఉద్యమ కాలంలో స్ఫూర్తి ఇచ్చిన తెలంగాణ తల్లినే జగిత్యాలలో నిలుపుకుంటామన్నారు. అభివృద్ధి కోసం పార్టీ మారిన అంటున్న ఎమ్మెల్యే జగిత్యాలలో సంవత్సర కాలంలో ఏం అభివృద్ధి చేసారో ప్రజలకు చెప్పాలి? అని ప్రశ్నించారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ ఒంటరి గెలుపు కాదు.. ఇది కేసీఆర్ గెలుపు అని కవిత అన్నారు. నాయకులు, ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఇబ్బంది ఉండదని అన్నారు. జగిత్యాలలో రాహుల్ గాంధీ వచ్చిన కేసీఆర్ బొమ్మను చూసి సంజయ్ ని గెలిపించారని అన్నారు. జగిత్యాలలో గులాబి జెండా ఎగురావేస్తామన్నారు. జగిత్యాల అంటే బీఆర్ఎస్ అడ్డ అన్నారు.
Read also: Top Headlines @1PM: టాప్ న్యూస్!
మీరు గెలిపించిన నాయకుడు పార్టీకి ద్రోహం చేసిన వెళ్లిపోయాడన్నారు. కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ అసెంబ్లీకి వెళ్ళి ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతాడో చూద్దామన్నారు. జిగిత్యాలకు ఒక్క రూపాయి రాలేదు, జగిత్యాలలో ఏం అభివృద్ధి జరగలేదన్నారు. పైసల కోసం సంజయ్ పార్టీ మారాడు.. పైసలా కోసం పార్టీ మారినవాడు నాయకులు కారని ఎమ్మల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది.. మీలో ఒకరు ఎమ్మెల్యే అవుతారు, మనకు ఎమ్మెల్యేలు అవసరం లేదన్నారు. కేసీఆర్ సైనికులుగా మీరు ఉన్నారు.. మన ప్రభుత్వం వస్తుందని అన్నారు. తెలంగాణ తల్లిని, బతుకమ్మను దూరం చేసారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
Bigg Boss 8: నేడే “బిగ్‌బాస్ సీజన్ 8” గ్రాండ్ ఫినాలే.. ప్రైజ్‌మనీ ప్రకటించిన నాగార్జున .. ఎంతంటే..?