NTV Telugu Site icon

MLC Jeevan Reddy: కాంగ్రెస్ పాలన చూసి బీజేపీ ఓర్వలేక పోతుంది..

Jeevan Reddy

Jeevan Reddy

MLC Jeevan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది ఉత్సవాలను చేస్తుంటే.. కాంగ్రెస్ పాలన చూసి బీజేపీ ఓర్వలేక పోతుందని విమర్శించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఉచిత బస్ రవాణా ఇస్తున్నారా?.. రైతు రుణాలు మాఫీ చేశారా?.. ఎంఎస్పీ ఇవ్వాల్సిన మీరు.. చట్టబద్దత కల్పించడం లేదు అని ప్రశ్నించారు. కానీ మేము వరి బోనస్ ఇచ్చి కొంటున్నామన్నారు. బీజేపీ వాళ్లు కూడా మమ్మల్ని ఏం చేస్తున్నారు అని అడుగుతుంటే విచిత్రం అనిపిస్తుంది.. కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తున్నామని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Read Also: PM Modi :ఈరోజు సాయంత్రం సినిమా చూడనున్న ప్రధాని మోడీ.. మూవీ పేరేంటంటే?

ఇక, మా మీద చార్జిషీట్ కాదు.. బీజేపీ వాళ్లు ఇచ్చిన హామీలపై ప్రాసిక్యూట్ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ నేతలు మమ్మల్ని విమర్శించే కంటే ముందు మీరు ఆత్మ విమర్శ చేసుకోండి అని తెలిపారు. 20 వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసింది వాస్తవం కదా..? హరీష్ రావు.. మీరు చేసింది ఎంత..? అని అడిగారు. నువ్వు చేసిన మాఫీ వడ్డీకే సరిపోయింది.. సన్న రకాల వడ్లకు బోనస్ ఇస్తుంది.. బోనస్ ఇవ్వడం వల్ల రైతులకు మరింత ఎక్కువ ధర లభిస్తుంది అని పేర్కొన్నారు.