ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఆడ, మగ, చిన్నా, పెద్దా, మంత్రి, ముఖ్యమంత్రి అనే తేడా లేకుండా అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియా వచ్చినప్పటినుంచి కొన్ని తెలియని విషయాలు తెలుసుకుంటుంటే.. మరికొన్ని అసభ్యకర వీడియోలు దర్శనమిస్తున్నాయి. కొందరు ఆకతాయిలు మహిళలను ఫోటోలు చేసి మార్ఫింగ్ చేస్తున్నారు. సొంతంగా ఓ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇతరుల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా.. ఓ వ్యక్తి ఇన్స్టాగ్రామ్ వేదికగా మహిళల అసభ్య పోస్టులు చేసిన ఘటన వెలుగు చూసింది.
Read Also: Sankranti Holidays: ఏపీలో వారికి మరో రోజు సెలవు.. ఉత్తర్వులు జారీ
జగిత్యాల జిల్లాలో ఓ వ్యక్తి.. బస్టాండ్, రద్దీ ప్రాంతాలు, మార్కెట్లలో రోడ్ల పై ఉన్న మహిళల ఫోటోలు అసభ్యకరంగా తీస్తూ ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నాడు. మహిళలు, యువతుల ఫోటోలు తీసి ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేస్తున్నాడు శ్రవణ్ అనే వ్యక్తి. తైస్ అండ్ లెగ్గిన్స్ పేరిట ఇన్‌స్టాలో పోస్టులు పెడుతున్నాడు. ఈ క్రమంలో.. పలువురు మహిళలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. నిందితుడు బండారి శ్రవణ్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. శ్రవణ్ గతంలో సెల్ పాయింట్ నిర్వహించాడు. ఈ క్రమంలో నిందితుడిని విచారించిన పోలీసులు.. పలు వీడియోలు, ఫోటోలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి మొబైల్లో వేల సంఖ్యలో వీడియోలు, ఫోటోలు లభ్యమయ్యాయి. శ్రవణ్ పై 67 ఐటి యాక్ట్, బీఎన్ఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: PM Modi: కాశ్మీర్ భారీ మార్పులు.. రాత్రిపూట ఐస్ క్రీం తినేందుకు లాల్ చౌక్ కు వెళ్తున్నారు..