Jagtial: తిన్నతిండికి బిల్లు కట్టమంటే.. యజమానిపై దాడి చేసిన కస్టమర్లు..
- జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ స్వీట్ హౌజ్ యజమాని పై దాడి..
- తిన్న ఫుడ్ కు బిల్లు ఇవ్వాలని అడిగినందుకు దాడికి పాల్పడ్డ కస్టమర్..
- యజమానిని చితకబాదిన ఓ యువతి, ఇద్దరు యువకులు..
- టౌన్ పోలీస్టేషన్ లో స్వీట్ షాప్ యజమాని ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagtial: తిన్న ఫుడ్ కు బిల్లు కట్టమని అడిగిన స్వీట్ హౌజ్ యజమానిపై ముగ్గురు కస్టమర్లు దాడి పాల్పడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. జగిత్యాలలో ఓ స్వీట్ హౌజ్ కి ఒక యువతి, ఇద్దరు యువకులు వచ్చారు. అయితే అక్కడ స్వీట్స్ ఆర్డర్ చేసి బగా తిన్నారు. డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతుండటంతో స్వీట్ హౌజ్ యజమానికి కస్టమర్లను డబ్బులు ఇవ్వాలని అడిగాడు. అంతే యువకుతి ఆగ్రహంతో ఎందుకు డబ్బులు ఇవ్వాలి అంటూ యజమానికి వద్దకు దుర్భాషలాడుతూ వెళ్లింది. లోపలికి ఎందుకు వస్తున్నావ్.. తిన్న తిండికి డబ్బులు కట్టాలా కదా? అని యజమాని ప్రశ్నించారు. దీంతో యువతితో పాటు వెనుక నుంచి వచ్చిన ఓ యువకుడు స్వీట్ యజమాని కాలర్ పట్టుకుని కడుపులో పిడుగుద్దులు గుద్దాడు.
Read also: Karthika Somavaaram: కార్తీక చివరి సోమవారం.. శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు..
Also Read
తలపై కొడుతుండటంతో అటు నుంచి మరో యువకుడు వచ్చి యజమానిని తీవ్రంగా కొట్టడం మొదలు పెట్టాడు. అక్కడున్న మిగతా కష్టమర్లు దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా యువకులు ఆగలేదు. యజమానిపై దాడి చేస్తూనే వున్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెంటనే స్వీట్ షాప్ యజమాని టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన నిన్న (ఆదివారం) సాయంత్రం జరిగినట్లు తెలుస్తుంది. సీసీ కెమెరాల ఆధారంగా దాడికి పాల్పడిన ముగ్గురిని అదుపులో తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. వీరు ముగ్గరు తాగి యజమానిపై దాడి చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Kaleshwaram Commission: నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ..
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!