Jagtial Tragedy: డబ్బే ప్రపంచం.. డబ్బు లేకపోతే మానవ సంబంధాలకు విలువేలేదు. జానెడు పొట్ట నిండాలంటే చేతిలో పైసా ఉండాల్సిందే. ఇటు హాలో అంటే.. ఇటు బోలో అని పలకాలన్నా జేబులో డబ్బులు ఉండాలి. అలాంటి డబ్బు కుటుంబాలను నిలబెడుతుంది.. పడగొడుతుంది. సమాజంలో గౌరవంగా బతకాలంటే ప్రతి ఒక్కరికీ డబ్బే కావాలి. అలాంటి గౌరవాన్ని అందించేందుకు కుటుంబ పెద్దలు నానాకష్టాలు పడతాడు.
Read also: Nizamabad Crime: నిజామాబాద్‌లో ఘరానా మోసం.. 18 పౌండ్ల కోసం రూ.2.75 లక్షల ఫ్రాడ్..
ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎంత ఖర్చైనా ఆదుకుంటాడు. అలాంటి పెద్దవారు చనిపోతే వారి ఆస్తిని పంచుకున్నారు గానీ అంత్యక్రియలకు ముందుకు రాలేదు ఓ కుటుంబం. మృత దేహం అంబులెన్స్‌లో వున్న ఇంటి లోపలికి కూడా అనుమతించలేదు. అంత్యక్రియలకు కూడా ఎవరూ రాకపోవడంతో స్థానికులు మృతదేహాన్ని అంబులెన్స్ లోనే తరలించారు. చివరకు వారే అంత్యక్రియలు జరిపించారు. దీంతో అక్కడ అచ్చం ఆ నలుగురు మూవీ సీన్ రిపీట్ అయింది.
Read also: Hyderabad Crime: భార్య భర్తల దొంగ అవతారం.. మెచ్చుకున్నారో మొత్తం దోచేస్తారు
జగిత్యాలలో చెందిన సాధుల సత్తమ్మ తన సొంత ఇంట్లోనే నివాసం ఉంటుంది. ఈమెకు ఎవరూ లేకపోవడంతో బంధువులను తనకు తోడుగా పెట్టుకుంది. తనను బాగా చూసుకుంటారు అనుకుందో ఏమో గానీ తనతో వున్న బంధువులకు సత్తమ్మ ఆస్తిని పంచి ఇచ్చింది. అయితే కొంత కాలంగా సత్తమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో వైద్యం పొందుతూ ఆమె నిన్న ఆసుపత్రిలో మృతి చెందింది. మృతదేహాన్ని ఆంబులెన్స్‌లో సత్తమ్మ ఇంటికి తరలించారు. అక్కడ సత్తమ్మ మృత దేహాన్ని బంధువులు ఇంట్లోకి తీసుకుని రావద్దని, మీరే ఏమైనా చేసుకోవాలని, మాకు సంబంధం లేదంటూ చేతులు దులుపుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 12 గంటల వరకు సత్తెమ్మ మృతదేహాన్ని ఆమె సొంతింట్లోనే ఉంచేందుకు బంధువులు అంగీకరించలేదు.
Read also: Warangal Crime: వరంగల్ జిల్లాలో దారుణం.. గర్ల్స్ క్యాంపస్‌లో విద్యార్థిని ఆత్మహత్య..
దీంతో సత్తమ్మ మృతదేహం 6 గంటలకు పైగా అంబులెన్స్ లోనే ఉంది. సత్తమ్మ మృతదేహాన్ని చూస్తు ఉండలేక అక్కడున్న స్థానికులు ఆమె పాత ఇంటి తాళాలు పగలగొట్టి మృతదేహాన్ని ఉంచారు. సత్తమ్మ బంధువులు వున్న వారందరికి మృతి వార్త తెలిపారు. అయితే ఎవరూ రాలేదు. ఈ రోజు ఉదయం ఎవరు రాకపోవడంతో ఇరుగుపొరుగువారు అదే అంబులెన్స్‌లో అంత్యక్రియలకు తరలించారు. సత్తమ్మ ఆస్తులు పంచుకున్న రక్త సంబంధీకులు కొరివి పెట్టేందుకు కూడా ముందుకు రాలేదు. దీంతో అక్కడే ఉన్న కొంతమంది దహన సంస్కారాలు పూర్తి చేశారు. కనీస మానవత్వం లేకుండా వ్యవహరించిన సత్తమ్మ బంధువుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్తమ్మ ఆస్తిని పంచుకుని ఆమె అంత్యక్రియలు కూడా చేయలేదని మండిపడ్డారు.
AP Rains: మరో 3 రోజులు ఏపీకి వర్ష సూచన.. ఈ జిల్లాలో భారీవర్షాలు