Jagga Reddy: టీడీపీ పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మళ్ళీ బతికే అవకాశం కేసీఆర్ ఇచ్చారని గ్గారెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. చాలా సమస్యలు ఈ ప్రభుత్వం పట్టించు కోలేదని ఆరోపించాఉ. మా పార్టీ సమస్య లు మీద ఏం మాట్లాడనంటూ తెలిపారు జగ్గారెడ్డి. కేసీఆర్ బీఅరెస్ పార్టీని ఎక్కడైనా పెట్టుకోవచ్చు.. ఏపీ లో పెట్టుకోవచ్చు అంటూ పలికారు. కేసీఆర్ ఏపీ కి వెళ్తున్నాడు చంద్రబాబు ఇక్కడికి వస్తున్నాడ అంటూ ఎద్దేవ చేశారు. చంద్రబాబుకి మంచి అవకాశం కేసీఆర్ ఇచ్చాడని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ మళ్ళీ కేసీఆర్ రూపంలో బతికే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పంచాయితీ అయి పోయిందని ఇక కేసీఆర్ ఏపీ లో సక్సెస్ కాలేడని అన్నారు. కానీ చంద్రబాబు తెలంగాణ లో సక్సెస్ అవుతాడంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాదాన్ని కేసీఆర్ మరచిపోయాడన్నారు కేసీఆర్ దాన్ని తొక్కేసాడంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు.
Read also: NTR: అమెరికాలో స్పైసీ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న తారక్…
టీడీపీ ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్న కేసీఆర్ చిన్న రాష్ట్రాల వల్ల ఉపయోగం లేదని కేసీఆర్ అన్నాడని జగ్గారెడ్డి గుర్తు చేశారు. కానీ తెలంగాణ వాదాన్ని అడ్డంపెట్టుకుని గెలిచాడని ఆరోపించారు. తెలంగాణ వాదాన్ని కేసీఆర్ చంపేశాడని, రాష్ట్రం ఉంది కానీ వాదం పోయిందని జగ్గారెడ్డి తెలిపారు. చంద్రబాబు, టీడీపీ మీద ఎన్ని నోర్లు మొత్తుకున్నా లాభం లేదని అన్నారు. టీడీపీకి మంచి ఎంట్రీ ఇచ్చారు కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ టీడీపీ బీఅర్ఎస్ కలిసిన కలవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల ప్రభావం కొంత ఉండొచ్చు… బీఎస్పీ ప్రభావం కూడా ఉంటుందని అన్నారు. బీఅర్ఎస్ తెలుగు వాళ్ళు ఉన్న చోట్ల ప్రభావం ఉంటుందన్న ఆయన మళ్ళీ అక్కడికి కూడా టీడీపీ వెళ్తుందని తెలిపారు. టీడీపీ మళ్ళీ బతికే అవకాశం కేసీఆర్ ఇచ్చారని అన్నారు. టీడీపీ ఇప్పుడు మంచి ఎంట్రీ దొరికిందని, చంద్ర బాబు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొంటాడని జగ్గారెడ్డి అన్నారు. బాబు ఈ అవకాశాన్ని వదులుకొడని, బాబు మీద ఎంత మంది మంత్రులు మొత్తుకున్నా లాభం లేదని జగ్గారెడ్డి తెలిపారు.
Covid-19: విదేశాల నుంచి వచ్చిన నలుగురికి కోవిడ్ పాజిటివ్..