Site icon NTV Telugu

Jagga Reddy : నేను వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేయను

Jagga Reddy

Jagga Reddy

సంగారెడ్డిలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు. తన స్థానంలో భార్య నిర్మల జగ్గారెడ్డి పోటీ చేయనున్నారని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పినా కూడా తాను మళ్లీ పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు.

“సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డిని ఓడించినా ఇంట్లో కూర్చోను. పదేళ్లుగా అధికారం లేకున్నా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్నాం. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ జెండా మోసిన వారినే అభ్యర్థులుగా నిలబెట్టాం” అని జగ్గారెడ్డి గుర్తుచేశారు. నియోజకవర్గంలోని అన్ని సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ బలపడాలని, ప్రజల్లో మంచి పేరు ఉన్న వారే గెలవాలని ఆయన సూచించారు. సర్పంచ్ అభ్యర్థుల ఎంపికలో తాను ఎలాంటి జోక్యం చేసుకోనని, గ్రామాల్లో మాట్లాడుకుని నాయకులు, కార్యకర్తలే అభ్యర్థులను తుది నిర్ణయానికి రావాలని సూచించారు.

Supreme Court: పూజకు నిరాకరించిన క్రిస్టియన్ ఆర్మీ అధికారి తొలగింపు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు..

Exit mobile version