Site icon NTV Telugu

Jagadish Reddy : ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు జగదీష్‌రెడ్డి కౌంటర్‌

Jagadish Reddy

Jagadish Reddy

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి బీఆర్‌ఎస్‌లోని ఒక కీలక నేతనే కారణమని ఆమె ఆరోపించారు. జగదీష్‌రెడ్డి పేరు ప్రస్తావించకుండానే BRS లిల్లీపుట్‌ అంటూ కవిత ఫైర్‌ అయ్యారు. నల్గొండలో బీఆర్‌ఎస్‌ను నాశనం చేసిన లిల్లీపుట్‌ అన్న కవిత.. చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు ఒక్కడే గెలిచాడు అని వ్యాఖ్యానించారు. తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖను బహిర్గతం చేయడం అనుచితమని మండిపడ్డ కవిత, బీఆర్‌ఎస్‌ నాయకులే తనపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించారు.

Ravindra Jadeja: సర్ జడేజా అంటే ఆమాత్రం ఉంటది.. లక్ష్మణ్, గవాస్కర్ రికార్డులను కొల్లగొట్టిన జడ్డూ భాయ్!

జగదీష్‌రెడ్డిని ‘లిల్లీపుట్’గా సంబోధిస్తూ కవిత హాట్ కామెంట్స్ చేశారు. ఇక కవిత వ్యాఖ్యలకు జగదీష్‌రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. “నా ఉద్యమ ప్రస్థానంపై కవిత జ్ఞానానికి జోహర్లు” అంటూ వ్యంగ్యంగా స్పందించారు. కేసీఆర్‌ శత్రువుల మాటలనే కవిత వల్లే వస్తున్నాయని, ఆమెకు సానుభూతి వ్యక్తం చేస్తున్నానని అన్నారు జగదీష్‌ రెడ్డి

Minister Satya Kumar: జగన్ కూడా రేపు జైలుకు వెళ్లాలి..

Exit mobile version