NTV Telugu Site icon

Jagadish Reddy : కాంగ్రెస్‌ మార్పు మాత్రం తిరోగమనంలా ఉంది

Jagadish Reddy

Jagadish Reddy

తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి మూడు నెలల అవుతోందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మూడు నెలల అనేది తక్కువ కాలం కాదన్నారు. మార్పు తెస్తామని ప్రజలకు చెప్పితే…. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చారన్నారు. మార్పు మాత్రం తీరోగమనంలా ఉన్నదని, బీఆర్ఎస్ పాలనలో పొందిన అనేక అవకాశాలు ఇవ్వాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోల్పోతున్నారన్నారు. పల్లెల్లో, పట్టణాల్లో నీళ్ళు లేక ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్నారని, కేసీఆర్ మీదా నమ్మకంతో అత్యధికంగా యాసంగి పంట వేశారని జగదీష్‌ రెడ్డి అన్నారు.

అంతేకాకుండా..’ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిందీ కరువు వచ్చింది…. నాగార్జున సాగర్ లో 510 అడుగుల నీళ్ళు ఉన్నా రైతులకు నీళ్ళు ఇచ్చాం. ఇవ్వాళ నాగార్జున సాగర్ లో నీళ్ళు ఉన్నా…. రైతులకు నీళ్ళు ఇవ్వడం చేత కావడం లేదు. కర్ణాటక రాష్ట్రంలో నీళ్ళు ఉన్నా…. ప్రభుత్వం కాంగ్రెసే ఉన్నా అడగడం చేత కావడం లేదు. మానవ బాంబులు అయితాం…. పేగులు మెడలో వేసుకుటాం… ఏం భాష రేవంత్ రెడ్డి మాట్లాడేది. ఇవ్వాళ రైతుల పేగులు నీ మెడలో వేసుకునే పరిస్థితీ వచ్చిందీ. ఇవ్వాళ వ్యవసాయ రంగం మీదా సమీక్ష లేదు… పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇవ్వాళ కాళేశ్వరంలో 400 క్యూసెక్కుల నీళ్ళు వృధాగా పోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంకి కరువు కనపడడం లేదు….

 

బీఆర్ఎస్ శంఖుస్థాపనలు చేసిన పనులు మొదలు పెట్టుకుంటు…. 90 రోజుల్లో అది చేశాం, ఇది చేశామనీ గొప్పలు చెప్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ కొట్టుకొని పోవాలని చూస్తున్నారు…. బిఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏంటనే నీటి పారుదల పైన సమీక్ష చేయాలి…. రైతాంగానికి ఏం బరోసా ఇస్తారో చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మాని….. కరువు పర్యటన చెయ్యాలి. గుత్తా అమిత్ రెడ్డినీ ఎవరు అడ్డుకోవడం లేదు…. ఆయనే ప్రకటన చేసుకున్నాడు …… ఆయనే అడ్డుకుంటున్నారని చెప్తున్నారు….. రెండు రోజుల్లో నల్లగొండ , భువనగిరి అభ్యర్ధుల ప్రకటన ఉంటుంది.’ అని జగదీష్‌ రెడ్డి అన్నారు.