తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం భువనగిరి మండలం తుక్కపురం గ్రామంలోని పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతానికి చేయడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. విద్యతో మనిషుల జీవితాల్లో వెలుగు నింపవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. గిరిజనులకు, దళితులకు, బలహీన వర్గాలతో పాటు మైనార్జీలకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు పాటుపడుతున్నారని ఆయన అన్నారు.
అంతేకాకుండా రాష్ట్రంలో 1000కి పైగా గురుకులను ప్రారంభించారని, ఇన్ని గురుకులాలు ప్రారంభించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని ఆయన వెల్లడించారు. ఇంటర్ పైన విద్యకు స్వస్తి చెప్పే మహిళల డ్రాపౌట్స్ ను అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 33 మహిళా డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఆయన కోరారు.
MP Soyam Bapu Rao : కేసీఆర్.. మా ఓపికను చేతగానితనంగా భావించొద్దు