Site icon NTV Telugu

Jagadish Reddy: కేసీఆర్ ను తిట్టి బతుకుదాం అనుకుంటోంది కాంగ్రెస్

Jagadesh Reddy

Jagadesh Reddy

Jagadish Reddy: కేసీఆర్ ను తిట్టి బతుకుదాం అనుకుంటోంది కాంగ్రెస్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి సమస్య కొంత …కాంగ్రెస్ పార్టీ సమస్య కొంతతో రైతాంగం నష్టపోతోందన్నారు. వర్ష పాతం నమోదు అయిన నీటి నిల్వ చేయడం లో  కాంగ్రెస్ పార్టీ విఫలం అయిందన్నారు. ఎండకాలం లోనూ ఒక్క చెరువు ఎండి పోకుండా కేసీఆర్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ నీళ్లు వెనక్కి తీస్కుని పంటలను కేసీఆర్ రక్షించారన్నారు. కేసీఆర్ ఉండి ఉంటే .. ఒక ఎకరం పంట ఎండకపోతుండే అంటున్నరు రైతులు అని తెలిపారు.

Read also; Komatireddy: కేబుల్ బ్రిడ్జ్ వేసి అభివృద్ధి అంటున్నారు.. కేసీఆర్ పై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్న అనగానే ప్రభుత్వం నీళ్లను విడుదల చేస్తోందన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. కేసీఆర్ ను తిట్టి బతుకుదాం అనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను భయ పెట్టలేరన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఒకడిగా బయటికివచ్చిన వ్యక్తి అన్నారు. కరువు పరిస్థితులు వస్తున్నాయి.. ప్రాజెక్టు ఎలా వాడుకోవాలి, నీళ్లను ఎలా వినియోగించుకోవాలి అనే సోయి లేదన్నారు. ప్రభుత్వం ఇస్తాం అన్న బోనస్ 500 ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చామన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సచివాలయంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇస్తాం అన్న 2 లక్షల రుణమాఫీ విడుదల చేయాలన్నారు.
MP Sanjay Singh: ఆప్ ఎంపీకి బెయిల్ మంజూరు..

Exit mobile version