NTV Telugu Site icon

Ghmc: గ్రీన్ హైదరాబాద్ దిశగా అడుగులు.. 23 అంశాలకు స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్

Ghmc Vijayalakshmi

Ghmc Vijayalakshmi

Ghmc: ఇవాల జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మీ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. మొత్తం 23 అంశాలపై ఆమెదముద్ర లభించింది. అందులో పలు ఎస్‌ఆర్‌డీపీ కింద రోడ్డు వెడల్పు కార్యక్రామలకు కమిటి ఆమోదం తెలిపింది. ఎంవోయూలు, టెండర్లకు, పరిపాలన అనుమతులకు కమిటీ ఆమోదం తెలిపింది.

ఆమోదం పొందిన అంశాలు..

* కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద శేరిలింగంపల్లి జోన్‌లో గచ్చిబౌలి నుంచి GPRS క్వార్టర్స్ మీదుగా బ్రహ్మకుమారి సర్కిల్ 20లో గల సెంట్రల్ మీడియన్ సుందరీకరణ కోసం మూడేళ్ల పాటు జనవరి 2023 నుండి డిసెంబర్ 2025 వరకు గమన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తమ సొంత నిధులు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చారు. నిర్వాహకులతో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ MoU చేసుకునేందుకు అనుమతికి ఆమోదం.

* రోడ్డు డెవలప్మెంటులో బాగంగా 18 మీటర్ల రోడ్డు వెడల్పునకు గాను ఖాజా మేన్షన్ ఫంక్షన్ హాల్ అప్రోచ్ రోడ్ నుంచి అహ్మద్ నగర్, ధనబాల రెసిడెన్సీ నుంచి సరోజినీదేవి రోడ్డు వరకు లింక్ రోడ్డు ఏర్పాటుకు 178 ఆస్తులు సేకరణకు ఆమోదం.

* డిసెంబర్ 2022 ఆదాయ వ్యయాలను చీఫ్ ఎగ్జామినర్ అకౌంట్స్ కమిటీ తెలియజేసి ఆమోదం.

* రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ కింద హెరిటేజ్ బిల్డింగ్ నుంచి భారతీయ విద్యాభవన్ 12 మీటర్ల రోడ్డు, హెరిటేజ్ బిల్డింగ్ నుంచి కింగ్ కోఠి వరకు, సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ నుంచి కింగ్ కోఠి వరకు ప్రతిపాదిత రోడ్డు వెడల్పు కోసం 29 ఆస్తులు సేకరణకు ఆమోదం.

* ఎన్ఐఏ నుంచి డిసిసి క్రికెట్ గ్రౌండ్ వరకు రోడ్డు వెడల్పునకు 14 ఆస్తుల సేకరణకు ఆమోదం.

* రెయిన్ బజార్ చమన్ నుంచి అనుమోల్ హోటల్ ఫతేష నగర్ జంక్షన్ వరకు 30 మీటర్ల రోడ్డు వెడల్పునకు 136 ఆస్తుల సేకరణలకు ఆమోదం.

* కుత్బుల్లాపూర్ రోడ్డు నుంచవి పైప్ లైన్ మధ్య లింక్ రోడ్ వయా గోదావరి హోమ్స్ వరకు 18 మీటర్ల రోడ్డుని మాస్టర్ ప్లాన్‌లో చేర్చడం కోసం 68 ఆస్తులు సేకరణకు ఆమోదం.

* రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ కింద కల్వరి టెంపుల్ నుంచ హఫీజ్ పేట మంజీరా పైప్ లైన్ పాయింట్ రోడ్డు వరకు 24మీటర్ల రోడ్డు వెడల్పునకు, గ్రేవ్ యార్డ్ నుంచి బాంబే హైవే వయా 2 BHK, మీదుగా హఫీజ్ పేట్ చెరువు 18 మీటర్ల రోడ్ల వెడల్పునకు, వెస్ట్రన్ సైడ్ మేడికుంట చెరువు నుంచవి నేషనల్ హైవే 9, బాంబే హైవే వయా మాతృశ్రీ నగర్ 12 మీటర్ల రోడ్డు వెడల్పునకు మొత్తం 98 ఆస్తుల సేకరణకు ఆమోదం.

* సరూర్ నగర్ సర్కిల్ 5 వార్డు 19, 21 విజయపురి కాలనీ RD No.2 (VM హోమ్ కాంపౌండ్ వాల్) నుంచి SRL కాలనీ వరకు రూ. 598 లక్షల వ్యయంతో చేపట్టే స్ట్రామ్ వాటర్ నాలా నిర్మాణానికి టెండర్స్ పిలవడానికి పరిపాలనా అనుమతికి ఆమోదం.

* రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతిపేట్ గ్రామం ముల్గాడ్ చెరువులో మురుగు నీరు రాకుండా డైవర్షన్ నాలా పనులకు రూ.300 లక్షలతో నిర్మించడానికి పరిపాలనా టెండర్ పిలవడానికి ఆమోదం.

* రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం మదీనాగూడ గ్రామము ఈర్ల చెరువుకు డైవర్షన్ ఆప్ డ్రైనేజ్, ఫెన్సింగ్ పనులను రూ. 263.5 లక్షలతో చేపట్టుటకు పరిపాల, టెండర్లను పిలవడానికి అనుమతి కి ఆమోదం.

* కూకట్ పల్లి ఎల్లమ్మ చెరువు నుంచి డైవర్షన్ ఆప్ డ్రైనేజీ రూ. 274 లక్షలతో నిర్మించడానకి పరిపాల, టెండర్స్ కాల్ చేయడానికి అనుమతికి ఆమోదం.

* రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామ భగీరథమ్మ చెరువుకు డైవర్షన్ ఆఫ్ డ్రైనేజీ నాలాను రూ.257 లక్షలతో నిర్మించేందుకు పరిపాలన టెండర్ మంజూరుకు ఆమోదం.

* రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కింద చాంద్రాయాణగుట్ట పోస్ట్ ఆఫీస్ నుంచి గుర్రంచెరువు వయా, ఉమర్ మజీద్ నుంచ చర్చి వరకు * రోడ్డు వెడల్పునకు ప్రభుత్వానికి సమాచారం ఇస్తూ మాస్టర్ ప్లాన్లు చేర్చి,162 ఆస్తులు సేకరణకు ఆమోదం.

* రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ కింద పీలి దర్గా సలాం నుంచి నబిల్ కాలనీ కల్వర్టు జీహెచ్ఎంసీ లిమిట్ వరకు రోడ్డు వెడల్పునకు102 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం.
* రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ కింద ఉషా ముళ్లపూడి రోడ్డు నుండి గాజులరామారం వయా కూకట్ పల్లి ఎల్లమ్మబండ వరకు 30 మీటర్ల రోడ్డు వెడల్పునకు 332 ఆస్తులు సేకరణకు ఆమోదం.

*సరూర్ నగర్ పెద్ద చెరువు వద్ద తూము నిర్మాణం చేసేందుకు రూ. 299 లక్షలు పరిపాలన ఆమోదానికి ఆమోదం.

* కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గతంలో చెరువుల పునరుద్ధరణకు 9 ఏజెన్సీలు ఆసక్తితో ముందుకు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఆయా ఏజెన్సీలు ఆసక్తి చూపకపోవడంతో కొత్తగా మూడు ఏజెన్సీలకు చెరువుల పునరుద్ధరణకు కమిషనర్ ఎంఓయూ చేసుకునేందుకు ఆమోదం.

* చీఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంట్స్ ద్వారా జనవరి 31 వరకు ఆదాయ వ్యయ స్టేట్మెంట్లకు  ఆమోదం.

* కూకట్ పల్లి జోన్ సనత్ నగర్ వార్డ్ నం.100 కేఎల్ఎన్‌వై పార్క్ పునరుద్ధరణ పనుల కోసం రూ.241.80 లక్షల పరిపాలన ఆమోదానికి  ఆమోదం.

* కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద శేరిలింగంపల్లి జోన్ కొండాపూర్ గార్డెన్ నుంచి బొటానికల్ గార్డెన్ నుంచి మజీద్ బండ వరకు సెంట్రల్ మీడియం/ ట్రాఫిక్ ఐలాండ్ (మార్చి 2023 నుండి ఫిబ్రవరి 2026 వరకు) చెరిక్ ఇంటర్నేషనల్ స్కూల్ శేర్లింగం జోన్ కమిషనర్ కు ఎంఓయు అనుమతి ఆమోదం.

* కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలి కింద శేరిలింగంపల్లి జోన్ జయభేరి ఎంక్లేవ్ నుంచి రాడిసన్ హోటల్ మీదుగా డిఎల్ఎఫ్ సైబర్ సిటీ వరకు గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేసేందుకు మార్చి 2023 నుండి ఫిబ్రవరి 2026 వరకు డిఎల్ఎఫ్ ఫౌండేషన్ సొంత నిధులతో నిర్వహణ చేసేందుకు శేర్లింగంపల్లి జోన్ కమిషనర్ ఎంఓయు చేసుకునేందుకు అనుమతికి ఆమోదం.

* టేబుల్ ఐటెంకి ఆమోదం.. SRDP ద్వారా పాత చత్రినాక పోలీస్ స్టేషన్ నుంచి ఉప్పుగూడ మహంకాళి టెంపుల్ వరకు రూ.2.50 కోట్ల వ్యయంతో 60 ఫీట్ల CC రోడ్డుతో పాటుగా ఫుట్ పాత్ నిర్మాణానికి ఆమోదం.

Das Ka Dhamki Review: దాస్ కా ధమ్కీ మూవీ రివ్యూ

Show comments