NTV Telugu Site icon

IT Raids: శ్రీ ఆదిత్య హోమ్స్ లో ముగిసిన ఐటీ సోదాలు.. విచారణకు హాజరుకావాలని నోటీసులు

It Raids Aditya Homes

It Raids Aditya Homes

IT Raids: హైదరాబాద్‌ లోని శ్రీ ఆదిత్య హోమ్స్ లో ఐటీ సోదాలు ముగిసాయి. ఐదు రోజుల పాటు ఐటి సోదాలు కొనసాగాయి. శ్రీ ఆదిత్య హోమ్స్ డైరెక్టర్ల నుండి అనుమానాస్పద లావాదేవీలను ఐటీ అధికారులు గుర్తించారు. డైరెక్టర్ల స్టేట్మెంట్ ఐటి అధికారులు రికార్డు చేశారు. విచారణకు ఐటి ఆఫీస్ కి హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు అధికారులు. పలు డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్ లను ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ద్ద మొత్తంలో అక్రమ లావాదేవులను ఐటీ అధికారులు గుర్తించారు. ఫ్లాటు కొనుగోలుదారుల నుంచి బ్లాక్ లో నగదు తీసుకున్నట్లుగా ఐటీ గుర్తించారు.

Read also: Hair Growth: జుట్టు చివర్లను కత్తిరిస్తే.. వేగంగా పెరుగుతుందా?

ఈనెల (జనవరి 18) నుండి పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆదిత్య, సీఎస్‌కే, ఉర్జిత, ఐరా రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్లాట్ల వివరాల్లో అక్రమాలున్నట్లు ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఆదిత్య రియల్ ఎస్టేట్ కంపెనీ కార్యాలయాలతో పాటు కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. సోదాల్లో భాగంగా బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన కీలక పాత్రలు ఐటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టర్స్, అకౌంట్స్ సిబ్బందిని ప్రశ్నించారు. ఈ కంపెనీలు చేపట్టిన వెంచర్స్, అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన వివరాలు అరా తీశారు. ఐటీ సిబ్బంది విచారణకు అకౌంట్ సిబ్బంది సహకరించపోవడం కొన్ని కార్యాలయాలలో దాడులకు వచ్చినప్పుడు అకౌంట్స్ సిబ్బంది కనిపించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మరికొన్ని కార్యాలయాల్లో అకౌంట్ సిబ్బందిని ఐటీ అధికారులు విచారించి, అకౌంట్స్ సిబ్బంది నుండి బ్యాంక్ ట్రాన్స్‌యాక్షన్స్ వివరాలు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు రియల్ ఏస్టేట్ సంస్థలు సమర్పించిన ఆదాయపన్నుకు సంబంధించి అవకతవకలు గుర్తించిన ఐటీ అధికారులు.. ఆయా రియల్ ఏస్టేట్ సంస్థలు విక్రయించిన ప్లాట్ల విక్రయాల గురించి ఆదాయ పన్ను శాఖాధికారులు ఆరా తీసిన విషయం తెలిసిందే..
BIG Breking: చెన్నై ద్రౌపది దేవి ఉత్సవాల్లో అపశృతి.. భక్తులపై క్రేన్‌ పడటంతో నలుగురు మృతి