IT Rides Update: జానారెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు.. పారిజాత, కెఎల్ఆర్ ఇళ్లలో ముగిసిన తనిఖీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Rides Update: ఇవాళ (శుక్రవారం) ఉదయం నుంచి మాజీ మంత్రి జానా రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జానా రెడ్డి తనయుడు రఘువీరారెడ్డి వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విస్పర్ వ్యాలీ విల్లాలోని రఘువీరారెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. జానా రెడ్డి మరో కుమారుడు జయవీర్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించింది. నాగార్జునసాగర్ నుంచి జయవీర్ బరిలో నిలిచారు. మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ కోసం రఘువీర్ దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ నేతలకు చెందిన 18 చోట్ల ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, నిన్న ఉదయం నుంచి బడంగ్ పేటకు చెందిన కాంగ్రెస్ నేతలు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పారిజాత లక్ష్మీనరసింహారెడ్డి నివాసాల్లో ఇన్‌కంటాక్స్ అధికారులు సోదాలు ముగిశాయి. కాంగ్రెస్ నేతల ఇంటి నుంచి ఐటీ అధికారులు తెల్లవారుజామున వెళ్లిపోయారు.
బడంగ్ పేటలోని కాంగ్రెస్ నేతలు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పారిజాత లక్ష్మీనరసింహారెడ్డి నివాసాల్లో సోదాలు నిర్వహించేందుకు ఐటీ అధికారులు వచ్చిన సమయంలో నిన్న ఉదయం నుంచి పారిజాత ఇంట్లో లేదు. ఆమె తిరుపతిలో ఉంది. ఆమె భర్త నరసింహారెడ్డి న్యూఢిల్లీలో ఉన్నారు. తిరుపతి నుంచి చెన్నై మీదుగా నిన్న రాత్రి పారిజాతాన్ని ఐటీ అధికారులు హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈరోజు ఉదయం ఆరున్నర గంటల వరకు ఐటీ సోదాలు జరిగాయి. పారిజాత హైదరాబాద్ రాగానే ఆమె భర్త నరసింహారెడ్డి కూడా న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. పారిజాత నరసింహారెడ్డి ఆదాయం, వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీశారు. ఐటీ అధికారుల ప్రశ్నలకు సమాధానమిచ్చినట్లు పారిజాత నరసింహారెడ్డి మీడియాకు తెలిపారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
ఎన్నికల బరిలో నిలిస్తే ప్రత్యర్థులకు నష్టం వాటిల్లుతుందన్న భయంతోనే ఐటీ దాడులు చేశారని పారిజాత నరసింహారెడ్డి విమర్శించారు. మరోవైపు కిచ్చెన్నగారిలోని లక్ష్మారెడ్డి నివాసంలో ఇవాళ తెల్లవారుజాము వరకు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పారిజాత నరసింహారెడ్డి, కేఎల్ఆర్ నివాసాల్లో ఐటీ అధికారులు కీలక పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై ఐటీ అధికారులు స్పష్టత ఇవ్వాలి. కాగా.. ఐటీ సోదాలపై కాంగ్రెస్ నేతలు సీరియస్‌గా స్పందించారు. బీఆర్ఎస్కు సహకరించాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఐటీ సోదాలు చేస్తోందని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఐటీ సోదాలకు భయపడేది లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా అన్నారు. కాగా, ఐటీ సోదాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Rajastan: రాజస్థాన్‌లో ఈడీ దాడులు.. ఐఏఎస్ సుబోధ్ అగర్వాల్‌కు సంబంధించిన 25 ప్రాంతాల్లో సోదాలు
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!