NTV Telugu Site icon

IT Raids: మళ్లీ ఐటీ దాడులు.. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లలో సోదాలు

It Raids

It Raids

IT Raids: హైదరాబాద్ లో మళ్లీ ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. తెల్లవారుజాము 4 నుంచే ఐటీ దాడులు మొదలయ్యాయి. ఐటీ కార్యాలయం నుంచి సిబ్బంది 40 కార్లు, 3 సీఆర్పీఎఫ్ బస్సుల్లో బయలుదేరారు. ప్రస్తుతం ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కంపెనీకి చెందిన గచ్చిబౌలి ప్రధాన కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 18 చోట్ల ఐటీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి దేశ వ్యాప్తంగా శాఖలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు ఒక్కసారిగా భారీ వాహనాలతో బయటకు రావడంతో ఎవరి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. ఎవరి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతాయో మరికొద్ది సేపట్లో తేలిపోనుంది. పెద్ద సంఖ్యలో ఐటీ అధికారులు కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. దీంతో ఐటీ శాఖ బడా వ్యక్తులపై దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఐటీ దాడులు చేస్తుండటంతో హైదరాబాద్‌లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రాజకీయ నాయకుల్లో టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఎవరిపై ఐటీ దాడులు జరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు.

Read also: Love is Crazy: దానికి ఒప్పుకోలేదని.. ప్రియురాలి గొంతు కోసిన ప్రేమోన్మాది..

తాజాగా మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు హైదరాబాద్ లోని ప్రముఖ వ్యాపారులు, వ్యాపార సంస్థలలో ఐటీ సోదాలు జరగడం సంచలనం రేపింది. ఈ క్రమంలో మరోసారి ఐటీ దాడులు పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి మల్లారెడ్డిపై రెండు రోజులుగా ఏకకాలంలో ఐటీ దాడులు జరగడం తెలంగాణలో కలకలం రేపింది. మల్లారెడ్డి ఇళ్లతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలో ఐటీ అధికారులు రెండు రోజులుగా సోదాలు చేశారు.ఈ సోదాల్లో భారీగా నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో చూపని సుమారు రూ.20 కోట్ల నగదు, పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు మంత్రి గంగుల కమలాకర్‌, టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ గాయత్రి రవి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. అలాగే హైదరాబాద్‌లోని ప్రముఖ షాపింప్ మాల్స్‌పై మూడు రోజులుగా ఐటీ దాడులు జరిగాయి. ఆ తర్వాత గత నెలలో వంశీరామ్ బిల్డర్స్‌పై ఐటీ దాడుల్లో ఐటీ అధికారులకు భారీగా నగదు పట్టుబడింది.ఇలా హైదరాబాద్ లో వరుస ఐటీ దాడులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నగరంలో ప్రతినెలా ఎక్కడో ఒకచోట ఐటీ దాడులు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Loan App Harassment: లోన్‌ యాప్‌ వేధింపులు.. మరో యువకుడు బలి