IT Raids: మళ్లీ ఐటీ దాడులు.. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లలో సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Raids: హైదరాబాద్ లో మళ్లీ ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. తెల్లవారుజాము 4 నుంచే ఐటీ దాడులు మొదలయ్యాయి. ఐటీ కార్యాలయం నుంచి సిబ్బంది 40 కార్లు, 3 సీఆర్పీఎఫ్ బస్సుల్లో బయలుదేరారు. ప్రస్తుతం ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కంపెనీకి చెందిన గచ్చిబౌలి ప్రధాన కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 18 చోట్ల ఐటీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి దేశ వ్యాప్తంగా శాఖలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు ఒక్కసారిగా భారీ వాహనాలతో బయటకు రావడంతో ఎవరి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. ఎవరి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతాయో మరికొద్ది సేపట్లో తేలిపోనుంది. పెద్ద సంఖ్యలో ఐటీ అధికారులు కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. దీంతో ఐటీ శాఖ బడా వ్యక్తులపై దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఐటీ దాడులు చేస్తుండటంతో హైదరాబాద్‌లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రాజకీయ నాయకుల్లో టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఎవరిపై ఐటీ దాడులు జరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు.
Read also: Love is Crazy: దానికి ఒప్పుకోలేదని.. ప్రియురాలి గొంతు కోసిన ప్రేమోన్మాది..
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
తాజాగా మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు హైదరాబాద్ లోని ప్రముఖ వ్యాపారులు, వ్యాపార సంస్థలలో ఐటీ సోదాలు జరగడం సంచలనం రేపింది. ఈ క్రమంలో మరోసారి ఐటీ దాడులు పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి మల్లారెడ్డిపై రెండు రోజులుగా ఏకకాలంలో ఐటీ దాడులు జరగడం తెలంగాణలో కలకలం రేపింది. మల్లారెడ్డి ఇళ్లతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలో ఐటీ అధికారులు రెండు రోజులుగా సోదాలు చేశారు.ఈ సోదాల్లో భారీగా నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో చూపని సుమారు రూ.20 కోట్ల నగదు, పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ గాయత్రి రవి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. అలాగే హైదరాబాద్‌లోని ప్రముఖ షాపింప్ మాల్స్‌పై మూడు రోజులుగా ఐటీ దాడులు జరిగాయి. ఆ తర్వాత గత నెలలో వంశీరామ్ బిల్డర్స్పై ఐటీ దాడుల్లో ఐటీ అధికారులకు భారీగా నగదు పట్టుబడింది.ఇలా హైదరాబాద్ లో వరుస ఐటీ దాడులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నగరంలో ప్రతినెలా ఎక్కడో ఒకచోట ఐటీ దాడులు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Loan App Harassment: లోన్ యాప్ వేధింపులు.. మరో యువకుడు బలి
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!