NTV Telugu Site icon

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంకు నాకు ఎటువంటి సంబంధం లేదు.. దర్యాప్తుకు సహకరిస్తా..

Mlc Kavitha

Mlc Kavitha

ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్కామ్ లింకులు బయటపడుతున్నాయి. తాజాగా కేంద్ర బీజేపీ నాయకులు ఈ స్కామ్ లో సీఎం కేసీఆర్ కుమార్తె కవితదే ముఖ్యపాత్ర అని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంకి నాకు ఎటువంటి సంబంధం లేదని, దర్యాప్తుకు సహకరిస్తా అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. లిక్కర్‌ స్కాం ఆరోపణలపై కవిత స్పందిస్తూ.. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నేను మానసికింగా కుంగిపోతానని వారు అనుకుంటున్నారని పేర్కొన్నారు.

ఈపోరాటంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. నాపై ఆరోపణలు చేసిన కేంద్రంపై పోరాటంలో వెనక్కొ తగ్గేదిలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు.. బట్టకాల్చి మీద వేస్తున్నారు. ఎవరి మీద వారిమీద ఆరోపణలు చేయడం సరైంది కాదు.. కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ భయపడతారని ఇలాంటి ఆలోచన చేస్తున్నారు. ఇది వ్యర్థ ప్రయత్నాలు మిగిలిపోతాయి.. కేసీఆర్ ని మానసికంగా కృంగదీయాలని చూస్తున్నారు.. మాపై ఆరోపణలు చేసినా మడమ తిప్పకుండా పోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారు.

కేసీఆర్ ఫ్యామిలీతో పాటు లిక్కర్ మాఫియా నుంచి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు రూ. 150 కోట్లు అందాయని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ పర్వేజ్‌ వర్మ. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్ లో ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించారని ఆరోపించారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్, ఇతర ఎక్సైజ్ అధికారులతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఓబెరాయ్ హోటల్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం ప్రైవేట్ విమానంలో ఢిల్లీకి వచ్చేవారని, దీనికి తెలంగాణకు చెందిన లిక్కర్ మాఫియా సహకరించేదని ఆరోపించారు. సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇద్దరు కలిసి ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించారని, పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాంటి విధానాన్నే అమలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

కేసీఆర్ కుటుంబ సభ్యులు ఢిల్లీలో ఎల్1 లైసెన్సు హోల్డర్లని, మద్యం మాఫియాను దక్షిణాది నుంచి ఢిల్లీకి తీసుకువచ్చింది కేసీఆర్ కూతురు కవితే అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఆరోపించారు. రెడ్డి బ్రదర్స్ ను కూడా తీసుకువచ్చిందని, కవిత ఢిల్లీకి వచ్చి రూ.4.5 కోట్లతో డీల్ కుదిర్చారని అన్నారు. ఆప్ పంజాబ్, గోవా ఎన్నికల సందర్భంగా అడ్వాన్సుగా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. పంజాబ్ లో లిక్కర్ ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేయించారని, చద్ధా ఫ్యామిలీ నుంచి రూ. 4.5 కోట్లు ముట్టాయని,రూ. 3 కోట్లు నగదు, రూ.1.5 కోట్ల క్రెడిట్ నోట్ తీసుకున్నారని అన్నారు. ఇదంతా కేసీఆర్ కూతురు కవిత ద్వారానే జరిగిందని తీవ్ర ఆరోపణలపై తీవ్ర దుమారం రేగింది. దీంతో కేసీఆర్ ఫ్యామిలీపై బీజేపీ కావాలనే కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తోందని, దర్యాప్తుకు సహకరిస్తానని స్పష్టం చేసారు.
Mlc Kavitha Press Meet Live: ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ లైవ్