Site icon NTV Telugu

Danam Nagender: సీఎం కేసీఆర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే నందుబిలాల్ నిరసన చేయడం తప్పా?

Danam Nagender, Assam Cm

Danam Nagender, Assam Cm

సీఎం కేసీఆర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే నందుబిలాల్ నిరసన చేయడం తప్పా? అని ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వాఖ్యలు చేశారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంకో ముఖ్యమంత్రి పై వాఖ్యలు చేయడం అస్సాం సాంప్రదాయమా..? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ సంస్కృతి.. సంప్రదాయాలు.. చెడగొట్టేందుకే అస్సాం సీఎం వచ్చారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. గణేష్ ఉత్సవ సమితి కాషాయ బట్టలు వేసుకొని.. విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. నిమజ్జన కార్యక్రమంలో హిందూ, ముస్లిం ల మధ్య చిచ్చు పెట్టి, గొడవలు సృష్టించే కుట్రలు చేశారని మండిపడ్డారు.

read also: Danam Nagender: మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల గురించి అస్సాం సీఎంకు ఏం తెలుసు..!

అందుకోసం ఇతర రాష్ట్రాలకు చెందిన సీఎంలు, కేంద్ర మంత్రులు వచ్చారని తీవ్ర విమర్శలు చేశారు. కాషాయ బట్టలు.. టోపీలు పెట్టుకొని.. అల్లర్లకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారని అన్నారు. మత ఘర్షణలు సృష్టించెందుకే బండి సంజయ్ భాగ్యలక్ష్మి ఆలయం ఈ మధ్య తరచూ వెళ్తున్నారని అన్నారు. తెలంగాణలో ఎన్నో సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ మత సామరస్యానికి కృషి చేస్తుంటే.. బీజేపీ మత ఘర్షణలు చేయాలని చూశారన్నారు. నందుబిలాల్ ఏం తప్పు చేశారు, ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే నిరసన తెలిపారని అన్నారు.
SCO Summit: ఎస్‌సీఓ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ.. 15 మంది దేశాధినేతలు హాజరు

Exit mobile version