NTV Telugu Site icon

Irrigation Day: తెలంగాణలో సాగునీటి దినోత్సవ వేడుకలు.. జిల్లాల వారిగా ఇలా..!

Kcr

Kcr

Irrigation Day: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి దినోత్సవ వేడుకలు మొదలయ్యాయి. రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు నీటిపారుదల దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం, కేటాయింపులకు నీరు, ఇతర నిర్మాణాలు, సాగునీటి రంగంలో తీసుకొచ్చిన మార్పులపై నియోజకవర్గాల వారీగా నీటిపారుదల శాఖ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. సాగునీటి పండుగ నేపథ్యంలో కాళేశ్వరంతోపాటు అన్ని జిల్లాల్లోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల డ్యామ్‌లు, లిఫ్ట్‌ స్కీమ్‌లు, పంప్‌హౌజ్‌లను రంగురంగుల దీపాలతో అలంకరించారు. ఊరూర చెరువుల పండుగను గురువారం నిర్వహించనున్నారు. చెరువుల పునరుద్ధరణ పథకం మిషన్ కాకతీయ కింద మరమ్మతులు చేసిన చెరువుల కట్టలపై కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

జిల్లాల వారిగా.. 

* రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి దినోత్సవం వేడుకల్లో మంత్రి కేటీఆర్‌ పాల్గొననున్నారు. రామప్ప రిజర్వాయర్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించి గోదావరికి హారతి ఇవ్వనున్నారు. నేడు ములుగులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటించనున్నారు. ఉదయం 10:15 గంటలకు హెలికాప్టర్ ద్వారా ములుగు చేరుకుంటారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయం, మోడల్ బస్టాండ్, సేవాలాల్ భవన్, డిజిటల్ లైబ్రరీ, ఐ అండ్ పీఆర్ మీటింగ్ హాల్, సీసీ రోడ్డు తదితర పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

* నేడు నిజమాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించనున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా న్యూ అంబేద్కర్ భవన్ లో సాగు నీటి దినోత్సవం లో పాల్గొననున్నారు. నిజమాబాద్ అర్బన్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్. ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొననున్నారు.

* నేడు నిజమాబాద్ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించనున్నారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎస్.ఆర్.ఎస్.పి. రివర్స్ పంపింగ్ జీరో పాయింట్ వద్ద సాగునీటి దినోత్సవంలో మంత్రి పాల్గొననున్నారు.

* నేడు కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ లో స్పీకర్ పోచారం పర్యటించనున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దాపూర్ రిజర్వాయర్ వద్ద జరిగే సాగునీటి దినోత్సవంలో స్పీకర్ పాల్గొననున్నారు.

* నేడు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మంత్రి హరీష్ పర్యటించనున్నారు. సంగారెడ్డి జిల్లా చిన్న చల్మెడలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి మంత్రి భూమి పూజ చేయనున్నారు. సిద్దిపేట జిల్లా చందూలపూర్ లో చందూలాపూర్ ఎత్తిపోతల పథకానికిమంత్రి హరీష్ రావు భూమి పూజ చేయనున్నారు.

* సూర్యాపేట జిల్లాలో సాగునీటి సంబరాలలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాలో కాలేశ్వర జలాలకు లక్ష జనహారతి నిర్వహించనున్నారు. చివ్వెంల నుండి పెన్ పహాడ్ వరకు కాలేశ్వరం కాలువల వద్ద జనాలకు ప్రత్యేక పూజలు జరగనున్నారు. 7 మండలాలలో 126 గ్రామాల ప్రజలతో 280 మంది అధికారుల పర్యవేక్షణలో కాలేశ్వరం జలాలకు లక్ష జన హారతి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీశ్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.

* నేడు భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో అన్నారం సరస్వతీ బ్యారేజ్ వద్ద దశాబ్ధి వేడుకలు జరగనున్నాయి. సాగునీటి దినోత్సవం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభంకానుంది. ముఖ్య అతిథులుగా మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరుకానున్నారు. 3 వేల‌ మంది రైతులతో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. గాయని‌ మంగ్లీతో స్పెషల్ ఈవెంట్స్ నిర్వహించారు. నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమలు, లేజర్ లైట్ షో, మంత్రుల సందేశాలు‌ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తిచేసింది.
Petrol-Diesel rates: భారత్ లో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు.. లీటరు ఎంతో తెలుసా..?