Site icon NTV Telugu

TS Gurukulam: గురుకులాల్లో ప్రవేశానికి ముగిసిన పరీక్ష‌

Gurukulam

Gurukulam

మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులలో 6,7,8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం నిర్వహించిన ప్రవేశపరీక్షకు 87.4మంది విద్యార్థులు హాజరయ్యారని కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలో ఆరో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసిన వారిలో 86.7 శాతం మంది, ఏడో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసిన వారిలో 89.8శాతం విద్యార్థులు, ఎనిమిదో తరగతి కోసం దరఖాస్తు చేసిన వారిలో 84.8 శాతం మంది విద్యార్థులు ప్రవేశపరీక్షకు హాజరయ్యారని ఆయన పేర్కోన్నారు.

ఆరో తరగతిలో 1223 సీట్లు,
ఏడో తరగతిలో 893 సీట్లు,
ఎనిమిదో తరగతిలో 636 సీట్లను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తామన్నారు.

కాగా.. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థ (సీఓఈ) అల్గునూర్‌, గౌలిదొడ్డిలో 9వ తరగతిలో రెగ్యులర్‌ అడ్మిషన్‌కు, గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థ (సీఓఈ) పరిగి (బాలికలు), ఖమ్మం (బాలురు)లో 8వ తరగతిలో రెగ్యులర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జూన్‌ 20 నుంచి జూలై 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. జూలై 31న ప్రవేశ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో నిర్వహిస్తారు. www.tswreis.ac.in, tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్ల ద్వారా పూర్తి సమాచారం పొందవచ్చు.

National Herald Case: నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న రాహుల్ గాంధీ

Exit mobile version