NTV Telugu Site icon

Millet Year 2023: చక్కని ఆరోగ్యానికి తృణధాన్యాలే ఆధారం

Millets (1)

Millets (1)

మన అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. తృణధాన్యాలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని విద్యార్థులకు ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ నీరజ సూచించారు. రోజూ మన ఆహారంలో తృణధాన్యాలను భాగం చేసుకోవాలని, ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా వాటిని భుజించడం అలవరచుకోవాలని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వెస్ట్ ఛాన్సలర్ డాక్టర్ బి.నీరజా ప్రభాకర్ సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘అంతర్జాతీయ విరుధాన్యాల ఏడాది 2028 ప్రారంభోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

మన పూర్వీకులు అన్నిరకాల తృణధాన్యాలు తిని, వాటిలో మంచి పోషకాలు లభించడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉండేవారని, కానీ ప్రస్తుత యువత పిజ్జా, బర్గర్స్ వంటి ఫాస్ట్ఫుడ్తో పాటు బాగా పాలిష్ చేసిన వరి అన్నాన్ని తినడానికి అలవాటుపడి ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారని ఆమె విచారం వెలిబుచ్చారు. ప్రతిఒక్కరూ తృణధాన్యాలతో తయారు చేసిన వంటకాలను, అంటే రాగి ఇడ్లీ, రాగి దోస, కిచిడీ వంటి వాటిని కనీసం ఒక పూట అయినా తినేలా అలవాటు చేసుకోవాలని సూచించారు, వాటిలో కాల్షియం, ప్రోటీన్, ఫెబర్లు ఎక్కువగా ఉండడం వల్ల విరేచనం సాఫీగా అవుతుందని, తద్వారా దాదాపు సగం రోగాలు కూడా నయమవుతాయన్నారు. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు, చిరుధాన్యాలను భుజిస్తే, అని నెమ్మదిగా అరగడం వల్ల ఎక్కువసేపు శక్తిని విడుదల చేస్తాయని వీసీ డాక్టర్ నీరజ చెప్పారు. అంతర్జాతీయ చిరుధాన్యాల ఏడాదిపై గీతం అవగాహన కల్పించడం ముదావహమని జాతీయ పోసికాహార సంస్థ. (ఎన్ఐఎన్) శాస్త్రవేత్త డాక్టర్ అనంత్ అన్నారు. మొక్కల ద్వారా వచ్చిన చిరుధాన్యాలను ప్రతిరోజూ భుజించగలమని, అందులో కూడా ప్రోటీన్ ఉంటుందని, అదే మాంసాహారాన్ని రోజూ తీసుకోలేమన్నారు.

Read Also:Top Headlines @5PM: టాప్ న్యూస్

పలురకాల ఆహారాన్ని (డైవర్సిఫెడ్జ్ ఫుడ్ ) ను భుజించడం వల్ల తగినంత పోషకాలు లభిస్తాయని, ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పారు. తగినంత ప్రతిఫలం లభించేలా చేస్తే రైతులు కూడా ముందుకొచ్చి తృణధాన్యాలను సాగుచేస్తారని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు. కొన్నిరకాల ఆహారాలు భుజించాక పొట్ట, మెరడు చాలా చైతన్యవంతంగా పనిచేస్తాయని, అలా మనకు అనుగుణమైన, అందుబాటులోని ఆహారాలను, మంచి అవగాహనతో భుజించడం అందరచుకోవాలని ఉస్మానియా వర్సిటీకి చెందిన డాక్టర్ డి.కోదండరామ్ సూచించారు. వీది, ఎప్పుడు, ఎంత తినాలనేది కూడా ముఖ్యమన్నారు. మంచి, పోషక విలువలున్న ఆహారావు అలవాట్లను చిరుప్రాయం నుంచే అలవరచుకోవాలని, సహజ సిద్ధంగా దొరికే అడని సండ్లను, స్థానికంగా దొరికే నూనె గింజలను తినడం మంచిదని వికాస డెరైక్టర్ బి. సాలోమి యేసుదాస్ సూచించారు.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సి. అరుణారెడ్డి, గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు, స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ దత్తాత్రి కె.నగేష్, ఫుడ్ సెర్చ్ అండ్ టెక్నాలజీ విభాగాధిపతి) డాక్టర్ ఉమామహేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరుధాన్యాలతో చేసిన పలురకాల వంటకాలను విద్యార్థులు ఈ సందర్భంగా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. (ప్రముఖ స్వచ్చంద సంస్థ దక్కన్ డెవలప్మెంట్ సొసెబీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు చిరుధాన్యాలతో చేసిన పలురకాల ఆహార పదార్థం ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. పలు అంశాలలో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందచేశారు.

Read Also: Twitter: ఎలాన్ మస్క్‌కి ఊహించని షాక్.. ట్విటర్‌పై విజిల్ బ్లోయర్ బాంబ్