Site icon NTV Telugu

Inter JAC Madhusudhan Reddy : నవీన్ మిట్టల్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు

Madhusudhan Reddy

Madhusudhan Reddy

నవీన్ మిట్టల్ ఆరు కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు ఇంటర్ జేఏసీ చైర్మన్‌ మధుసూదన్ రెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ ఆన్ లైన్ వాల్యుయేషన్‌లో గ్లోబరిన్‌ సంస్థకు ఇంకో పేరుతో అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మూడు కోట్ల ముడుపులకు మారుపేరు సంస్థకు కాంట్రాక్టు ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. గ్లోబరీన్‌ సంస్థకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు మరో మూడు కోట్లు ఒప్పందం కుదుర్చుకున్నారని, నవీన్ మిట్టల్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రాణం పోయినా వెనకడుగు వేయనన్నారు. గ్లోబరీన సంస్థ వల్ల ఆనాడు 10లక్షల మంది విద్యార్థులు అగమయ్యారని, 20 మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రీ బిడ్డింగ్ మీటింగ్ కోయమ్ట్‌ సంస్థ వచ్చిందా లేదా? అని ఆయన ప్రశ్నించారు.

Also Read : Virat Kohli: సీల్ తీయని మొబైల్ పోయిందని కోహ్లీ ట్వీట్..జొమాటో రిప్లై అదుర్స్

ఈ నెల 9 వరకు బిడ్‌లకు చివరి గడువు ఉందని, ఆ కంపెనీ బిడ్ వేసిందా లేదా బయట పెట్టాలన్నారు మధుసూదన్‌ రెడ్డి. ఆరు కోట్ల రూపాయల ముడుపుల కోసం నవీన్ మిట్టల్ గ్లోబరీన్‌కు అనుకూలంగా పని చేస్తున్నారని, గ్లోబరీన్‌కు, కోయమ్ట్‌ సంస్థకు సంబంధం లేదని ప్రూవ్ చేయని ఆయన తెలిపారు. గ్లోబరీన్‌కు సీఈఓనే కోయమ్ట్‌ సీఈఓ కూడా అని ఆయన వెల్లడించారు. నవీన్ మిట్టల్ నేను చెప్పినవి తప్పని కమిషనర్ కార్యాలయంలోని అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేయని ఆయన సవాల్‌ విసిరారు. నేను ప్రమాణం చేయడానికి నేను సిద్దమన్నారు మధుసూదన్‌ రెడ్డి.

Also Read : Vetrimaaran: ట్రెండింగ్ లో వెట్రిమారన్… కారణం ఎన్టీఆర్, ధనుష్

Exit mobile version