Indrakiran Reddy: ఆ మార్పు.. ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indrakiran Reddy Gives Warning To Tamilisai: దేశంలో ఇప్పుడు గుణాత్మక మార్పు అవసరమని, అది ఒక్క సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి అన్నారు. జాతీయ రాజకీయాల్లో ఆయన నాయకత్వం అవసరం ఉందని చెప్పారు. రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి, అభివృద్ధిలో తీసుకెళ్తోన్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ సారథ్యంలో అభివృద్ది, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలుస్తుందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే.. అన్ని విషయాలపై పట్టున్న కెసిఆర్‌లాంటి సమర్థ నాయకుడి వల్లే సాధ్యమవుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారన్నారు. బీజీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ఎండగడుతూ.. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలను, ముఖ్య నేతలను ఏకం చేసేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
ఇదే సమయంలో.. గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యల్ని ఇంద్రకిరణ్ రెడ్డి ఖండించారు. తమిళిసై ఒక రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని, రాజ్ భవన్‌ను ఆమె రాజకీయ భవన్‌గా మార్చారని ధ్వజమెత్తారు. తమిళిసై తన పద్ధతి మార్చుకోకపోతే.. గతంలో ఎన్టీఆర్ హయాంలో గవర్నర్‌గా పనిచేసిన రాంలాల్‌కు పట్టిన గతే ఆమెకు పడుతుందని హెచ్చరించారు. అప్పట్లో రామ్‌లాల్ ఇలాగే రాజకీయాలు చేసి, ప్రజాగ్రహానికి గురయ్యారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్దిని అన్ని రాష్ట్రాలు ప్రశంసిస్తుంటే.. గవర్నర్‌కు మాత్రం ఇవేమీ కనిపించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా గవర్నర్ తన పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే మాత్రం సహించేదే లేదని ఇంద్రకిరణ్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!