IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- పూణే నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన
- పైలట్ అప్రమత్తతతో సేఫ్‌గా ల్యాండింగ్
- విమానం ముందు భాగంలో సొట్ట గుర్తింపు
- చండీగఢ్ వెళ్లాల్సిన సర్వీస్ రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. పూణే నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో 6ఈ352 (IndiGo 6E 352) విమానాన్ని గాల్లో ఉండగా పక్షి ఢీకొట్టినట్లు పైలట్ అనుమానం వ్యక్తం చేశారు. ల్యాండింగ్ సమయంలో పక్షి విమానాన్ని తాకినట్లు గ్రహించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో లోపల ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
విమానం ముందు భాగంలో సొట్ట.. నిపుణుల తనిఖీలు
విమానం సురక్షితంగా నిలిచిన అనంతరం ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల బృందం విమానాన్ని నిశితంగా పరిశీలించింది. ఈ తనిఖీల్లో విమానం ముందు భాగంలో ఒక సొట్ట పడినట్లు అధికారులు గుర్తించారు. పక్షి ఢీకొట్టడం వల్లే ఈ డ్యామేజ్ జరిగిందని సాంకేతిక బృందం నిర్ధారించింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించిన తర్వాత విమానాన్ని సమగ్ర తనిఖీల కోసం కేటాయించారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
చండీగఢ్ సర్వీస్ రద్దు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
షెడ్యూల్ ప్రకారం ఈ విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చండీగఢ్ వెళ్లాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాలు, విమానం ముందు భాగం దెబ్బతినడంతో చండీగఢ్ వెళ్లే సర్వీసును అధికారులు రద్దు చేశారు. ఆ విమానంలో ప్రయాణించాల్సిన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు ప్రత్యామ్నాయ విమాన సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!