Site icon NTV Telugu

US: అమెరికాలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

Rajesh

Rajesh

అమెరికాలో తెలంగాణకు చెందిన రాజేష్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రాజేష్ మృ‌తికి కారణమేంటో తెలియలేదు. మ‌ృతదేహం స్వగ్రామానికి తరలించేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బాధిత కుటుంబం కోరుతోంది. అలాగే మరణానికి గల కారణాలు తెలుసుకోవాలని అభ్యర్థిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Shiva Raj Kumar: తమిళ దర్శకుడితో శివ రాజ్ కుమార్ సినిమా

తెలంగాణలోని హనుమకొండకు చెందిన ఆరుకొండ రాజేష్.. 2016లో అమెరికా వెళ్లాడు. అక్కడినే చదువుకుంటున్నాడు. అయితే ఇటీవల మృతిచెందాడు. మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే కుమారుడి ఎలా చనిపోయాడో తెలియక తల్లడిల్లుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం పుచ్చుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే రాజేష్ తండ్రి కూడా ఇటీవల చనిపోయారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం సతమతమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు సహకరించాలని రాజేష్ తల్లి, సోదరి కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: Kolkata Doctor Case: మమతా బెనర్జీ రాజీనామా చేయాలి.. ‘‘నిర్భయ’’ తల్లి ఆగ్రహం..

Exit mobile version