అమెరికాలో తెలంగాణకు చెందిన రాజేష్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రాజేష్ మృతికి కారణమేంటో తెలియలేదు. మృతదేహం స్వగ్రామానికి తరలించేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బాధిత కుటుంబం కోరుతోంది. అలాగే మరణానికి గల కారణాలు తెలుసుకోవాలని అభ్యర్థిస్తున్నారు.
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లాకు చెందిన రాజేష్.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ మృతి చెందాడు. దీంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజేష్ బంధువులు అతడి మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు. వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన ఏరుకొండ రాజేష్ ఉన్నత చదువుల కోసం తొమ్మిదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. 2015లో ఎమ్మెస్ ట్రైనింగ్ చేసేందుకు వెళ్లిన రాజేష్.. మూడు రోజుల…