Warangal KU: కాకతీయ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకమైన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబర్ 28, 29, 30 తేదీల్లో జరిగే 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌కు కేయూ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ మేరకు వర్సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సదస్సుకు రాష్ట్ర మంత్రులు, వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగిస్తారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది శాస్త్రీయంగా చరిత్రను భద్రపరచడానికి దోహదపడే ప్రత్యేక వ్యవస్థ.. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 35 వేల మంది చరిత్రకారులు, పరిశోధకులు సభ్యులుగా ఉన్నారు. 1935లో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ఏర్పాటైనప్పుడు, ఈ సదస్సు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం జరుగుతుంది. చివరిసారిగా 1993లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వైస్ ఛాన్సలర్‌గా ఉన్నప్పుడు కాకతీయ యూనివర్సిటీ ఈ చారిత్రాత్మక సదస్సుకు వేదికైంది. దీంతో వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేష్, రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read also: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2,000 మంది చరిత్రకారులు ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మూడు రోజుల సదస్సులో పలువురు పరిశోధకులు 6 విభాగాల్లో సుమారు 1,030 పరిశోధనా పత్రాలను సమర్పించనున్నారు. ప్రొఫెసర్లు కృష్ణమోహన్ శ్రీమాలి, కుందన్ లాల్ తుతేజాల ప్రత్యేక ప్రసంగాలు ఉంటాయని కేయూ అధికారులు తెలిపారు. ఇందులో సనాతన ధర్మంపై కృష్ణమోహన్ శ్రీమాలి కీలకోపన్యాసం చేస్తారు. జేఎన్‌యూ ప్రొఫెసర్ మహాలక్ష్మి, ప్రొఫెసర్ సుబ్బరాయలు, ప్రొఫెసర్ అరుణ్ బందోపాధ్యాయ తదితరులు భారత చరిత్రపై కీలక ప్రసంగాలు చేస్తారు. గురు, శుక్ర, శనివారాల్లో జరిగే 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌కు కేయూ క్యాంపస్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరుకానున్నారు.
Read also: Covid-19 : 24 గంటల్లో 529 కొత్త రోగులు.. 3 మరణాలు, 7 రాష్ట్రాల్లో JN.1 సబ్ వేరియంట్ వ్యాప్తి
ఆయన వెంట అటవీ, పర్యావరణ, మత శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కూడా ఉన్నారు. ఈ మేరకు కాకతీయ యూనివర్సిటీ అధికారులు మంత్రులను ఆహ్వానించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ చాలా ముఖ్యమైన క్షణాలకు వేదిక కానుంది. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఆదిత్య ముఖర్జీ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రొఫెసర్ రామచంద్ర గుహకు ప్రతి ఐదేళ్లకోసారి ఇచ్చే లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేస్తారు. ద్వైవార్షిక ఉత్తమ పుస్తకంగా కృష్ణమోహన్ శ్రీమాలి అవార్డును అందుకోనున్నారు. ఈ రెండు అవార్డులు గెలుచుకున్న ఇద్దరికి రూ.50 వేల నగదు బహుమతి కూడా లభిస్తుంది. వీరితో పాటు మరో 11 మంది యువ పరిశోధకులకు కూడా ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేయనున్నారు.
Covid-19 : 24 గంటల్లో 529 కొత్త రోగులు.. 3 మరణాలు, 7 రాష్ట్రాల్లో JN.1 సబ్ వేరియంట్ వ్యాప్తి