NTV Telugu Site icon

ఇక వ‌రంగ‌ల్‌కు కేసీఆర్.. ఎంజీఎం ప‌రిశీల‌న‌..

CM KCR

క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోన్న స‌మ‌యంలో.. కోవిడ్ బాధితుల్లో ధైర్యాన్ని నింప‌డానికి పూనుకున్నారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు.. బుధ‌వారం రోజు హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రిని ప‌రిశీలించిన ఆయ‌న‌.. క‌రోనా రోగుల్లో భ‌రోసా నింపారు.. ఇక‌, క్లిష్ట స‌మ‌యంలో ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా వైద్య సేవ‌లు అందిస్తున్న వైద్యుల‌ను, జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌ను, న‌ర్సుల‌ను, ఇత‌ర సిబ్బందిని అభినందించారు.. ఈ సంద‌ర్భంగా.. జూనియ‌ర్ డాక్ట‌ర్లు, న‌ర్సుల స‌మ‌స్య‌లు ఏమున్నా ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. మ‌రోవైపు ఇప్పుడు వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు సిద్ధం అయ్యారు సీఎం కేసీఆర్.. ముఖ్య‌మంత్రి వరంగల్‌లో పర్యటించనున్నారని మంత్రి ఎర్ర‌బెల్లి దయాకర్‌రావు తెలిపారు.. రేపు కానీ ఎల్లుండి కానీ… ఎప్పుడైనా కేసీఆర్‌.. వరంగల్ కి వచ్చే అవకాశం ఉంద‌న్న ఆయ‌న‌.. ఎంజీఎంతో పాటు సెంట్రల్ జైలును కూడా పరిశీలిస్తారని వెల్ల‌డించారు. కోవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించార‌న్న ఆయ‌న‌.. సీఎం ఆదేశాలతో ప్రైవేట్ ఆస్ప‌త్రుల ఫీజుల నియంత్రణ కోసం కమిటీ ఏర్పటు చేయడంతో పాటు ఎంజీఎంలో మెరుగైన సేవలు అందేలా కమిటీలను ఏర్పటు చేసిన‌ట్టు తెలిపారు.