NTV Telugu Site icon

Uppal Stadium: ఉప్పల్ స్డేడియంకు వెళ్తున్నారా? అయితే ఇవి తప్పనిసరి

Uppal Stadium

Uppal Stadium

Uppal Stadium: ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ స్డేడియం వేల మంది క్రికెట్ అభిమానుల సందడితో దద్దరిల్లనుంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ముగిసిన మూడునెల వ్యవధిలోనే ఉప్పల్ లో టీమ్ ఇండియా న్యూజిల్యాండ్ వన్ డే మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అలరించనుంది. భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగే తొలివన్డే కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది..ఉప్పల్ స్టేడియం లోనికి గంట ముందుగానే టిక్కెట్లు కొన్న అభిమానుల అనుమతించనున్నారు. గేట్ నెంబర్ వన్ ద్వారా ఇండియా,కివీస్‌ జట్లు స్టేడియం లోపలికి చేరుకున్నాయి. మిగతా గేట్ల ద్వారా టిక్కట్ పై ముద్రించిన గేటు నెంబర్, సీటు నెంబర్ ఆధారంగా స్డేయం లోపలికి వేలాదిగా అభిమానులు మ్యాచ్ వీక్షించేందుకు చేరుకుంటారు. ఇక క్రికెట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రాచకొండ పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. స్టేడియంలో 39,000 మంది సీటింగ్ కెపాసిటీ ఉందని ప్రేక్షకులు, విధుల్లో ఉన్న అధికారులు, మీడియా వ్యక్తులు.. ఇతరులతో సహా 40,000 మందికి పైగా స్టేడియంను సందర్శించే అవకాశం ఉందని తెలిపారు.

Read also: IT Rides Again: మరోసారి ఐటీ దాడులు కలకలం.. 30 టీములుగా..

క్రికెట్ నేపథ్యంలో.. వివిధ విభాగాలకు చెందిన దాదాపు 2,500 మంది పోలీసులను స్టేడియంలో ఉంటారని తెలిపారు..స్టేడియం పరిసర ప్రాంతాల్లో మొత్తం 300 సీసీటీవీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియం ప్రధాన రహదారి నుంచి స్టేడియం వైపు వెళ్లే మార్గంలోకి రావాంటే కచ్చితంగా టిక్కెట్ ఉండాల్సిందే ఇక్కడ టిక్కెట్ చూపి భారీకేడ్స్ దాటితే తప్ప లోపల ప్రధాన ద్వారం వద్దకు వెళ్లలేరు దీంతో.. టిక్కెట్ లపై ఉన్న గేట్ నెంబర్ ఆధారంగా అక్కడ మరోసారి తనిఖీ చేసి ప్రేక్షకులను లోపలికి అనుమతిస్తారు. ఈవిధమైన రెండచెల భద్రత నడుమ ఉప్పల్ మ్యాచ్ జరగనుంది. అయితే.. వేలాదిగా వాహనాలు ఉప్పల్ స్డేడియం వైపు రానున్నాయి. ఈనేపథ్యంలో మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతోపాటు స్డేడియం సమీపంలో రోడ్లకు ఇరువైపులా టూవీలర్ పార్కింగ్ చేసుకునే అవకాశం కల్పించారు.
Bandi Sai Bhagirath: ముదురుతున్న బండి సంజయ్ కొడుకు వివాదం..మరో వీడియో వైరల్!

Show comments